Begin typing your search above and press return to search.
కన్నడ హీరో కోసం తెలుగు హీరోకి నో చెబుతుందా?
By: Tupaki Desk | 10 Jun 2022 1:30 AM GMTపూజాహెగ్డే కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతుంది. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ అంటూ అన్ని భాషల్ని దున్నేస్తుంది. ఇటీవలే బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ ఎదెరైనా అమ్మడి వేగానికి మాత్రం బ్రేకులు పడలేదు. ఫెయిలూర్స్ ని పూజని ఏ మాత్రం వెనక్కి లాగి పెట్టేలేదని లైనప్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక హీరో కోసం మరో స్టార్ హీరో సినిమానే వదులుకోవడానికి సిద్దమైడిందన్న వార్త సైతం వస్తోంది అంటే? పూజా రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. విషయంలోకి వెళ్తే..
పాన్ ఇండియా స్టార్ యశ్ కథానాయకుడిగా కన్నడలో నర్తన్ అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన 'ముప్తీ'కి మంచి విజయం సాధించింది. ఈనేపథ్యంలోనే యశ్ మరోసారి సదరు దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని యశ్ లేదా కన్నడ లో 'ఆర్ ఆర్ ఆర్' ని పంపీణి చేసిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందని సమాచారం.
అయితే ఇందులో హీరోయిన్ గా పూజాహెగ్డే రంగంలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే ఆమెని కలిసి స్ర్కిప్ట్ వినిపించడం జరిగిందిట. హెగ్డే పూజా కూడా సానుకూలంగానే స్పందించిందట. శయ్ తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుందిట. ప్రాజెక్ట్ కి ఇంకా సంతకం చేయలేదు గానీ...యశ్ తో నటిస్తే ఇమేజ్ రెట్టింపు అవుతుందన్న ఆలోచనతో ఒకే చెప్పడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయని కన్నడ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈప్రాజెక్ట్ ఒకే చేస్తే గనుక అమ్మడి డేట్లు ఇబ్బంది ఏర్పడుతుంది? అన్న అంశం తెరపైకి వస్తోంది. ఇటీవలే సూర్యతో ఓ సినిమా చేయడానికి సంతకం చేసింది. దీంతో పాటు అంతకు ముందే సూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పింది. ఈ మూడు సినిమాలు చేయడానికి పూజా ఆసక్తిగా ఉన్నప్పటికీ డేట్లు సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.
అదే గనుక జరిగితే మహేష్ సినిమా నుంచి అమ్మడు తప్పుకునే అవకాశం ఉందని సమాచారం. తెలుగు సినిమా కన్నా..యశ్ తో నటించడం.. సూర్య సినిమావైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని గుస గుస వినిపిస్తుంది.
అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూడు సినిమాలు ప్రారంభమైతే తప్ప స్పష్టత లభించదని ఆమె సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తుంది. సినిమా ప్రారంభమైతే దాన్ని బట్టి డేట్లు సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.