Begin typing your search above and press return to search.
సీతారామం.. సీత పాత్ర చేయలేకపోయిన టాప్ హీరోయిన్
By: Tupaki Desk | 7 Aug 2022 10:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఒకప్పుడు చాలా బిజీగా కనిపించిన వారు ఇప్పుడు అగ్ర హీరోలతో పెద్దగా అవకాశాలను అందుకోవడం లేదు. ఇక కరెక్ట్ సమయంలోనే మృనల్ ఠాగూర్ సీతారామం అనే సినిమాతో చాలా బలమైన సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయంతో ఇప్పుడు ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కేవలం ఒకే ఒక సినిమాతో దశతిరిగి పోవడం అంటే ఇదే కావచ్చు. ఇండస్ట్రీలో స్టార్ హోదా అందుకోవడానికి కొన్నిసార్లు ఒకే ఒక్క సినిమా కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక దుల్కర్ సల్మాన్ తో ఆమె చేసిన సీతారామం సినిమా అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది. సినిమాలో దుల్కర్ సల్మాన్ తో సమానంగా ఆమె నటించింది అని చెప్పవచ్చు. ఆ పాత్రకు తగ్గట్టుగా మృనల్ ఠాగూర్ నటించిన విధానంపై ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
హీరో దుల్కర్ కూడా ఆమె తప్ప ఈ సినిమాలో ఎవరు కూడా సీత పాత్రకు న్యాయం చేయలేరు అని కూడా అన్నారు. అయితే ఈ పాత్ర కోసం మొదట కొంతమంది హీరోయిన్స్ ను సంప్రదించారట. కానీ వివిధ కారణాల వలన వారు ఈ ప్రాజెక్టును చేయలేకపోయారట. అందులో ముఖ్యంగా పూజా హెగ్డే కోసం దర్శకులు నిర్మాతలు చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేసినట్లు టాక్ వచ్చింది.
అయితే అప్పుడు కరోనా పరిస్థితులలో చాలా సినిమాలు షూటింగులు వాయిదా పడడంతో పూజ హెగ్డే ఈ ప్రాజెక్టులో నటించడానికి అవకాశం దొరకలేదట. డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్లనే సినిమా చేయలేకపోపోయినట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది హీరోయిన్స్ కూడా ఇలాంటి పాత్ర ఒక్కటి దొరికిన చాలు అనే అనుకుంటున్నారట. ఏదేమైనా కూడా సీతారామం సినిమాలో మృనల్ ఠాగూర్ తన సీత పాత్రకు 100% న్యాయం చేసి మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ బ్యూటీ తెలుగులో అగ్ర హీరోలతో కూడా మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.