Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: అందాల పూజ పునర్జన్మలో ఇలా
By: Tupaki Desk | 25 Sep 2019 4:17 PM GMTటాలీవుడ్ లో పూజాహెగ్డే హవా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు తెలుగు చిత్రసీమలో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. మరో వైపు ముంబై పరిశ్రమని గుప్పిట పట్టడం ఎలా అన్న ప్రణాళికల్లో ఉంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఓవైపు ప్రభాస్ సరసన `జాన్` అనే చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ అటు బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 4` అనే భారీ మల్టీస్టారర్ లోనూ నటించింది. జాన్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈలోగానే దీపావళి కానుకగా అక్టోబర్ లో హౌస్ ఫుల్ 4 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
తాజాగా హౌస్ ఫుల్ 4 (హెచ్.ఎఫ్- 4) చిత్రంలో పూజా హెగ్డే లుక్ ని లాంచ్ చేశారు. పోస్టర్ లో పూజా ద్విపాత్రాభినయం ట్విస్టు ఆకర్షిస్తోంది. అలాగే పూజా అందచందాలకు ఫిదా అయిపోవాల్సిందే. ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని పూజాని ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత కొత్తగా దర్శకుడు ఫర్హాద్ సామ్జీ డిజైన్ చేశారని అర్థమవుతోంది. ఈ సినిమా కథాంశంలో ప్రత్యేకించి పునర్జన్మల నేపథ్యంలో పుట్టుకొచ్చే కామెడీ సంథింగ్ స్పెషల్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. అంటే పూజా రెండు కాలాల్లో జీవిస్తుంది. ఇతర పాత్రల్లోనూ ఆ తరహా సస్పెన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే యాన్ ఎపిక్ రీ-ఇన్ కార్నేషన్ కామెడీ (పునర్జన్మల నేపథ్యంలో వచ్చే కామెడీ) అంటూ పోస్టర్ పై ముద్రించారు.
ఇది రెండు కాలాదుల్లో సాగే కథాంశం... 1419లో .. 2019లో కథ ట్రావెల్ అవుతుంది.. ఆ రెండు కాలాలకు కనెక్టివిటీ ఉంటుంది. రెండుచోట్లా పూజా ఎలా కనిపించనుంది? అన్నది తాజా పోస్టర్ లో రివీల్ చేశారు. ఇందులో రాజకుమారి మాలా అనే పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఆ పాత్రకు భారీతనం నిండిన లెహెంగా డ్రెస్ హైలైట్ గా నిలిచింది. అలాగే నేటితరం అల్ట్రా మోడ్రన్ అమ్మాయిగానూ పూజా రూపం 1419 గెటప్ కి పూర్తి ఆపోజిట్ గా కనిపిస్తోంది. అయితే రెండు చోట్లా అందాల ఆరబోతకు అడ్డూ ఆపూ ఏమీ లేకుండానే ఆ పాత్రను డిజైన్ చేశారని పోస్టర్ చెబుతోంది. అసలే బాలీవుడ్ కి తగ్గ ట్రీట్ ఎలా ఇవ్వాలి అన్నది పూజాకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవేమో. మొహంజోదారో చిత్రంలోనూ ఈ అమ్మడి అందచందాలు అంతే స్పెషల్ ట్రీట్ ఇచ్చాయి. ఇక ఈ చిత్రంలో కృతి సనోన్- కృతి కర్భంద లాంటి అందగత్తెలు సహనాయికలుగా నటిస్తున్నారు. 2019 దీపావళి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.