Begin typing your search above and press return to search.

పూజా... బాగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుందే

By:  Tupaki Desk   |   2 May 2018 10:58 AM GMT
పూజా... బాగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుందే
X
‘ఢీజే’ సినిమా చూసిన వాళ్లెవ్వ‌రికైనా పూజా హెగ్దే అందాల ప్ర‌ద‌ర్శ‌న ఏ రేంజ్ లో ఉంటుందో ఇట్టే అర్థ‌మ‌యిపోతుంది. బికినీ వేసి కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన పూజా... ఆ సినిమా త‌ర్వాత ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అమ్మ‌డు చేయ‌బోయే సినిమాల లిస్టు చాలా పెద్ద‌గానే ఉంది. అందుకోసం బాగా క‌ష్ట‌ప‌డుతోంది ఈ అమ్మ‌డు.

ప్ర‌స్తుతం ఎన్‌.టీ.ఆర్‌- త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది పూజా హెగ్దే. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా ట్రెయిన‌ర్ ని పెట్టుకుని వ్యాయామం చేసి ఏకంగా 20 కేజీలు త‌గ్గాడు తార‌క్‌. దాంతో స్లిమ్ లుక్కులో అద‌ర‌గొడుతున్నాడు. అలాంటి యంగ్ టైగ‌ర్ ప‌క్క‌న జోడిగా క‌నిపించాలంటే మ‌రి అమ్మ‌డు కూడా ఫిట్ గా ఉండాలిగా. అందుకే జిమ్ములో తెగ క‌స‌ర‌త్తులు చేస్తోంది పూజా. త‌న జిమ్ క‌స‌ర‌త్తుల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో కూడా పెట్టింది. ఆ క‌స‌ర‌త్తుల ప్ర‌భావ‌మేనేమో... ఇప్పుడు మ‌రింత గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తోంది పూజా. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో మీడియా కంట‌ప‌డింది పూజా.

చిన్న షార్ట్ వేసుకుని తొడ‌ల‌న్నీ క‌నిపించేలా రెఢీ అయ్యింది. కండ‌లు తిరిగిన తొడ‌లు చూస్తుంటే పూజా జిమ్ములో ఏ రేంజ్ క‌స‌ర‌త్తులు చేసిందో అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కు ముందే సెక్సీగా ఉన్న పూజా... ఇప్పుడు మ‌రింత ఫిట్ గా... మ‌రింత హాట్ గా క‌నిపిస్తోంది. ఇక ఎన్‌.టీ.ఆర్ ప‌క్క‌న పిల్ల జోరు ఏ స్థాయిలో ఉండ‌బోతుందో ఇప్ప‌టినుంచే ఊహించుకోవ‌ల్సిందే!