Begin typing your search above and press return to search.
బిందెను ముద్దాడి దర్శకేంద్రుడికి గిఫ్ట్
By: Tupaki Desk | 18 Sep 2019 5:07 AM GMT1982లో విడుదలైన `దేవత` సినిమాలోని `ఎల్లువెత్తి గోదారమ్మ…` పాటని `వాల్మీకి` కోసం రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. శోభన్ బాబు- శ్రీదేవి జంటపై బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది. ఈ పాటలో శ్రీదేవి ఐకానిక్ స్టెప్పులు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచాయి. ఇంతకాలానికి ఈ పాట రీమిక్స్ వస్తుండడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వరుణ్ - పూజా హెగ్డే జోడీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయగలరా? అంటూ క్లాసిక్ ఫ్యాన్స్ లో సందిగ్ధత నెలకొంది.
గోదావరి పరిసర ప్రాంతాల్లో వరుణ్ తేజ్- పూజాహెగ్డే జంటపై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా.. శేఖర్ మాస్టార్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించారు. వరుణ్ -పూజా ఈ పాటలో రెట్రో లుక్ లో కనిపిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో పూజా పాత్ర పేరు శ్రీదేవి. వరుణ్ గణేష్ పాత్రలో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 20న వాల్మీకి రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో ఈ పాట గురించి మాట్లాడుతూ ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఎంతో ఎమోషన్ అయ్యింది.
1500 బిందెలు ఉపయోగించి ఈ పాటను చిత్రీకరించారు. లెజెండ్ రాఘవేంద్రరావు పేరును ప్రస్థావించకుండా ఆ పాట గురించి మాట్లాడలేనని పూజా ఎంతో ఎమోషన్ అయ్యింది. అంతేనా వాల్మీకి ఈవెంట్లో రాఘవేంద్రుని పాదాలకు నమస్కరించి బ్లెస్సింగ్ తీసుకోవడం చూపరులను ఆకర్షించింది. శ్రీదేవి మ్యామ్ నాకు స్ఫూర్తి. ఆ పాటలో డ్యాన్స్ చేసే ముందు చాలానే ఆలోచించాను. కొంత భయపడ్డాను. చివరికి మ్యామ్ స్ఫూర్తితో డ్యాన్సులు చేశాను... అని వినయవిధేయతను చాటుకుంది. అదంతా సరే కానీ.. వేదికనెక్కేప్పుడు ఓ బిందెను చేతిలోకి తీసుకుని దానిని ముద్దాడి దర్శకేంద్రుడికి కానుకగా ఇచ్చింది పూజా. 1500 బిందెల్ని ఇలానే ముద్దాడి ఫ్యాన్స్ కి ఒక్కొక్కటి పంచాల్సిందిగా పూజా అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ పని చేస్తుందంటారా ఫ్యాన్స్ కోసం!