Begin typing your search above and press return to search.
పూజాకి స్వల్ప లక్షణాలే.. భయపడాల్సింది లేదు
By: Tupaki Desk | 28 April 2021 4:55 AM GMTటాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ లోనూ పూజా హెగ్డే క్రేజీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ సరసన దళపతి 65 చిత్రంలో నటిస్తోంది. ఆన్ లొకేషన్ ఉండగానే పూజా హెగ్డేకి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని కథనాలొచ్చాయి.
ప్రస్తుతం పూజా గృహ నిర్భంధంలో ఉన్నారు. వైద్య చికిత్స కొనసాగుతోంది. తన ఇంటి నుంచి పూజా ఇన్ స్టాలో అభిమానులతో క్రమం తప్పకుండా తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని పంచుకుంటున్నారు. తాను బావున్నానని కరోనా తేలికపాటి లక్షణాలు మాత్రమేనని తెలిపారు. ``మీరు నన్ను నవ్విస్తారు. నన్ను ప్రేమిస్తారు`` అని ఎమోషనల్ అయ్యారు పూజా. తన సెల్ఫీని కూడా పంచుకుంది.
తేలిక పాటి లక్షణాలే కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూజా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా ఆనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ త్వరలో రిలీజ్ కి రానుంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోనూ పూజా కథానాయికగా నటించింది.