Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్ల‌కి నాన్ వెజ్ స్ట‌ప్ ఇచ్చిన పూజాహెగ్డే!

By:  Tupaki Desk   |   7 March 2022 2:30 AM GMT
ట్రోల‌ర్ల‌కి నాన్ వెజ్ స్ట‌ప్ ఇచ్చిన పూజాహెగ్డే!
X
ప్ర‌స్తుతం ముంబై బ్యూటీ పూజాహెగ్డే `రాధేశ్యామ్` ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ముంబై..హైద‌రాబాద్ అంటూ బ్యూట చ‌క్క‌ర్లు కొడుతుంది. అన్ని మీడియా సంస్థ‌ల్ని చుట్టేస్తోంది. బ్యూటీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ప్రత్యేకంగా ప్ర‌మోట్ చేయాల్సి వ‌స్తోంది. మార్చి 11 వ‌ర‌కూ ఈ షెడ్యూల్ త‌ప్ప‌దు. ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు- పీఆర్ టీమ్ ఆదేశించిన‌ట్లు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే. పనిలో ప‌నిగా ఇదే స‌మ‌యాన్ని త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం ప్రీ ప్లాన్డ్ గా వాడుకుంటోంది.

పాన్ ఇండియా సినిమా స‌క్సెస్ అయితే గ‌నుక వ‌చ్చ క్రేజ్ ని బాలీవుడ్ లో ఎలా వినియోగించుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనూ ముందుకు సాగుతోంది. `రాధేశ్యామ్` టీమ్ తో వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు ఎలా ఉన్న‌ప్ప‌టికి వాటిని ఎక్క‌డా పెద‌వి దాట‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది.

ఎంత జాగ్ర‌త్త ప‌డినా ఏదో చోట దొర‌కాలిగా. అలా ముంబై ఈవెంట్లోనే ప్ర‌భాస్-పూజా ఎదురెదురు ప‌డినా క‌నీసం ముఖాలు కూడా చూసుకోలేదు. వ‌చ్చి త‌మ‌ప‌ని చూసుకుని వెళ్లిపోయారు. ఆ స‌న్నివేశంతో ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రిగింద‌ని మీడియా క‌న్నేసింది.

తాజాగా బ్యూటీ మ‌రోసారి ట్రోల‌ర్ల‌కి అడ్డంగా దొరికిపోయింది. ``అంద‌రూ నా స‌క్సెస్ ఫుల్ లైఫ్ గురించి అడుగుతున్నారు అని చెప్పే ప్ర‌య‌త్నంలో ``నా సెక్స్ లైఫ్`` గురించి అని పుసుక్కున నోరు జారింది. వెంట‌నే ఆ ప‌దాన్ని స‌రి చేసుకుంది. అయినా ట్రోల‌ర్లు విడిచిపెడ‌తారా? అస‌లే ఆక‌లి మీదున్న ట్రోలర్ల‌కి స‌రైన నాన్ వెజ్ లాంటి ఫుడ్ దొరికిన‌ట్లు అయింది.

ఆ వీడియోని క‌త్తిరించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డం...ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. దీంతో పూజా కావాల‌ని అంది అని భావించిన వాళ్లంతో ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ప్ర‌భాస్ ఫ్యాన్ పేరిట ఉన్న యూ ట్యూబ్ ఛానెల్స్ ఓ రేంజ్ లో పూజా అన్న ప‌దంపై ప్ర‌త్యేక క‌థ‌నాలే అల్లేస్తున్నాయి. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌ని స‌మంత సైతం ఎదుర్కుంది. ఆమె కూడా అనుకోకుండా సెక్స్ లైఫ్ అనే ప‌దాన్ని వాడేసింది. దీంతో నెటి జ‌నులు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ట్రోల‌ర్లు ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

ఇప్పుడు పూజా బ్యూటీ వంత్తైంది. సోష‌ల్ మీడియాలో ఇలాంటివి స‌హ‌జం. అప్పుడ‌ప్పుడు బాడీ ప్ర‌జెంట్..మైండ్ హాఫ్ సెంట్ వ్యాఖ్య‌లు చోటు చేసుకుంటాయి. వాటిని టార్గెట్ చేసి విమ‌ర్శించ‌డం భావ్యం కాద‌ని కొంద‌రు నెటి జ‌నులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.