Begin typing your search above and press return to search.

డిజె బ్యూటీకి ఆల్కహాల్ అక్కర్లేదట

By:  Tupaki Desk   |   28 March 2018 12:18 PM GMT
డిజె బ్యూటీకి ఆల్కహాల్ అక్కర్లేదట
X
పూజా హెగ్డే.. మొదట పద్దతిగా అమాయకంగా ఉండే సినిమాలు చేసి, డిజె సినిమాలో బికినీ లో కనపడి కుర్రకారు హార్ట్ బీట్ ఒక్కసారిగా పెంచేసింది. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు ఈ మధ్య ఈ భామ మొబైల్ స్క్రీన్ లపై కూడా కనువిందు చేస్తోంది. సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. ఈమె తన ప్రాణ స్నేహితురాలు ఒకామెతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదంటే నమ్మండి.

ఇన్స్టాగ్రామ్ లో పూజ ఒక వీడియో అప్లోడ్ చేసింది. అందులో తన ఫ్రెండ్ తో ఒక రెస్టారెంట్ లో వీళ్ళు చేసిన హడావిడి ఉంది. ఇదంతా చూస్తే తాగేసిందే ఏంటి అని డౌట్ వస్తుంది. కానీ బెస్ట్ ఫ్రెండ్ తో ఉంటే ఆల్కహాల్ అక్కర్లేదు అని తానే క్లారిటీ ఇచ్చింది. మంచి ఫుడ్ - గ్రేట్ మ్యూజిక్ - అదిరిపోయే కంపనీ అంటూ కితాబిచ్చించి. అసలు వెయిటర్ ఎన్నిసార్లు అట్టెంషన్ కోసం ప్రయత్నించినా ఈమె బిజీగా వుంది అని కూడా చెప్పుకొచ్చింది. కొన్ని హిందీ పాటలకు డబ్ స్మాష్ చేసినట్టు ఉందా వీడియో. మొత్తానికి స్నేహితురాలితో బాగానే ఎంజాయ్ చేసింది అని మాత్రం అర్ధమవుతోంది.

ఆన్ స్క్రీన్ ఏ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా అందంగా ఉంది పూజ. క్యాప్ పెట్టుకుని - ఒక నార్మల్ టీషర్టు - ప్యాంట్ లో భలే క్యూట్ గా కనిపిస్తోంది. డిజె తర్వాత కెరీర్లో బాగా బిజీ అయిపోయింది అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రంగస్థలం లో జిగేల్ రాణి గా మెగా పవర్ స్టార్ పక్కన స్టెప్పులెయ్యబోతోంది ఈ సుందరి. ఆ తరువాత మహేష్‌.. ఎన్టీఆర్.. ప్రభాస్ లను రొమాన్స్ చేయబోతోంది.