Begin typing your search above and press return to search.

సొంత భాషలో చేసేందుకు వెయిట్‌ చేస్తున్నా

By:  Tupaki Desk   |   8 Dec 2021 3:30 AM GMT
సొంత భాషలో చేసేందుకు వెయిట్‌ చేస్తున్నా
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం తమిళం మరియు హిందీల్లో కూడా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీస్ట్‌ సినిమా లో విజయ్ కు జోడీగా ఈఅమ్మడు నటిస్తోంది. ఆ సినిమా కు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక హిందీలో కూడా ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

ఈ అమ్మడు తెలుగు లో రాధే శ్యామ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మరో వైపు ఆచార్య సినిమా కూడా విడుదల కు సిద్దంగా ఉంది. ఆచార్య లో చరణ్‌ కు జోడీగా ఈఅమ్మడు నటించింది. తెలుగు లో మరో రెండు మూడు సినిమాలు కూడా ఈఅమ్మడు నటిస్తోంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు తన సొంత భాష అయిన కన్నడంలో కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా. అయితే పెరిగింది మొత్తం కూడా ముంబయి అవ్వడం వల్ల ఈ అమ్మడిని అంతా కూడా ముంబయి ముద్దుగుమ్మ అంటూ ఉంటారు. ముంబయిలో మోడలింగ్‌ చేస్తూ అక్కడ నుండి సౌత్‌ సినీ ఇండస్ట్రీకి వచ్చింది.

ఒక లైలా కోసం మరియు ముకుందా సినిమా ల్లో నటించిన పూజా హిందీలో హృతిక్ రోషన్‌ సినిమా కోసం టాలీవుడ్‌ కు దూరం అయ్యింది. మళ్లీ డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది.

సినిమాలు ఈ అమ్మడు వరుసగా చేసుకుంటూ వచ్చింది కాని ఇప్పటి వరకు సొంత భాష అయిన కన్నడంలో సినిమాను చేయలేదు. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ అమ్మడు ఆ విషయాన్ని గురించి స్పందించింది. తాను మంచి స్క్రిప్ట్‌ తో వస్తే ఖచ్చితంగా కన్నడంలో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఎంతో మంది సినీ ప్రముఖులను ఇండియన్ సినీ పరిశ్రమకు అందించిన కర్ణాటకకు చెందిన వ్యక్తిని నేను అయినందుకు గర్వంగా ఉంది. నేను కన్నడ అమ్మాయిని అని చెప్పుకునేందుకు గర్విస్తాను అంటూ చెప్పుకొచ్చింది. కన్నడం అంటే ఇష్టం అంటూనే కన్నడంలో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇన్నాళ్లు తాను అనుకున్న పాత్రలు రాలేదని.. తనకు సెట్‌ అయ్యే పాత్రలు రాలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. మంచి కథతో నా సొంత ఇండస్ట్రీలో అడుగు పెడతానంటూ చెప్పిన పూజా హెగ్డే కోసం ఏ కన్నడ దర్శకుడు కథను ఇస్తాడో చూడాలి. పూజా హెగ్డే కన్నడ కు చెందిన అమ్మాయి అయినా కూడా సౌత్‌ లో తెలుగు మరియు ఉత్తరాన హిందీలో మాత్రమే ఈమెకు మంచి గుర్తింపు ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.