Begin typing your search above and press return to search.
2020లో అలలు సృష్టించి 2022లో డీలా!
By: Tupaki Desk | 24 Dec 2022 4:17 AM GMT2020లో అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించింది పూజా హెగ్డే. ఈ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. బుట్టబొమ్మగా తెలుగు యువత గుండెల్లో స్థిరపడింది. కానీ అనూహ్యంగా ఆ తర్వాత పూజాకి కాలం కలిసి రాలేదు. కొన్ని వరుస డిజాస్టర్లతో డీలా పడింది. తన కెరీర్ కి వచ్చిన డోఖా ఏదీ లేకపోయినా కానీ పూజాకు 2021- 2022 సీజన్ అస్సలు కలిసి రాలేదన్నది వాస్తవం. 2021 ఆద్యంతం కరోనా ప్రకంపనాలతో షూటింగులు లేవు. వరుస చిత్రాల్లో నటించినా కానీ పూజా కు అవేవీ కలిసి రాలేదు.
ఈ ఏడాది పూజా నటించిన నాలుగు సినిమాలు విడుదలైనా కానీ ఏవీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ముందుగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ సినిమా 'రాధేశ్యామ్' విడుదలైంది. ఇది మిశ్రమ సమీక్షలతో డీలా పడింది. హైప్ దృష్ట్యా భారీ అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ తడబడింది. ఆ వెంటనే దళపతి విజయ్ సరసన నటించిన బీస్ట్ విడుదలైంది. ఈ మూవీ కూడా ప్రతికూల సమీక్షలతో చతికిలపడింది. విజయ్ స్టార్ పవర్ ఏదో ఒక రకంగా బాక్సాఫీస్ వసూళ్లకు సహకరించినా కానీ సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో విఫలమైంది. తమిళంలో ఘనమైన రీఎంట్రీ కోసం వేచి చూసిన పూజాకు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఆ తర్వాత రెండు వారాల కే విడుదలైన మల్టీస్టారర్ 'ఆచార్య' మరో డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా నటించింది. కానీ రొటీన్ ప్లాట్ నిరాశపరిచింది. ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే లేకపోవడం ఈ చిత్రం మరచిపోలేని డిజాస్టర్ల జాబితాలో చేరింది. ఇలాంటి సినిమా చేసినందుకు దర్శకరచయిత కొరటాల శివపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇయర్ ఎండ్ లో బాలీవుడ్ చిత్రం 'సర్కస్' (రణవీర్- పూజా జంటగా) కూడా విడుదలైంది. కానీ ఈ సినిమాకి అన్నీ నెగెటివ్ రివ్యూలే రావడంతో పూజా తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆడుతున్న థియేటర్లకు సరైన ఆక్యుపెన్సీ లేదని ట్రేడ్ చెబుతోంది. ఈ ఫలితం నిరాశాజనకమైనదని విశ్లేషిస్తున్నారు.
ఈ సన్నివేశంలో పూజా హెగ్డే ఇకపై భవిష్యత్ సినిమాలతో అయినా కంబ్యాక్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం తన కెరీర్ లో రెండు ప్రధాన ప్రాజెక్ట్ లపై చాలా హోప్ తో ఉంది. మహేష్- త్రివిక్రమ్ తో SSMB28 సహా సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. కొత్త సంవత్సరంలో ఇవి రెండూ వరుస హిట్లు కొట్టి తనకు బహుమతిగా మారతాయా.. లేదా? అన్నది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.