Begin typing your search above and press return to search.

బిగ్ బి తాతతో పూజా అల్లరి

By:  Tupaki Desk   |   26 July 2022 11:30 AM GMT
బిగ్ బి తాతతో పూజా అల్లరి
X
టాలీవుడ్ బుట్ట బొమ్మగా మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమంలో చాలా బిజీగా కనిపించిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గ్యాప్ లేకుండా సినిమాలో చేసే విధంగా అడుగులు వేస్తోంది. అలాగే మరొకవైపు తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయడానికి ఈ బ్యూటీ ఆసక్తిని చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ యాడ్స్ లలో కూడా కనిపిస్తూ ఉండడం విశేషం.

పూజా హెగ్డే కు ప్రస్తుతం ఉన్న డిమాండ్ అయితే మామూలుగా లేదు. ఇక కోట్లల్లో పారితోషికం అందుకుంటూ ఆమె నేషనల్ యాడ్స్ లలో కూడా నటిస్తోంది. రీసెంట్గా ఆమె బాలీవుడ్ లెజెంటరీ యాక్టర్ తో కూడా చాలా సరదాగా చేసిన ఒక యాడ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లెజెండరీ యాక్టర్ మరెవరో కాదు అమితాబ్ బచ్చన్.

ఆయనతో పూజా హెగ్డే మజా యాడ్ లో నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాతగా నటించిన బిగ్ బి మరోసారి ఎంతగానో మెప్పించారు. గతంలో అమితాబ్ ఇతర స్టార్స్ తో చేసిన యాడ్స్ కు మంచి గుర్తింపు అయితే దక్కింది.

ఇక ఇప్పుడు మాజ్ యాడ్ లో పూజా హెగ్డే తో కూడా అదే తరహా టైమింగ్ తో ఎంటర్టైన్ చేసి బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాలి సినిమాలో నటిస్తోంది.

ఇక తెలుగులో మాత్రం ఈ బ్యూటీ మరో పెద్ద సినిమాలో నటిస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న SSMB28 లో మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్టు లో మొదలు కానుంది.

ఇక తమిళంలో అయితే విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా డిజాస్టర్ కావడంతో అక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. మరి భవిష్యత్తులో అమ్మడు ఏవైనా కొత్త అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.