Begin typing your search above and press return to search.

అలా ఇలా మొత్తానికి దర్శకుడితో ఫోటో దిగిన పూజా..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 7:30 AM GMT
అలా ఇలా మొత్తానికి దర్శకుడితో ఫోటో దిగిన పూజా..!
X
ఇండస్ట్రీలో సైలెంట్ మెయింటైన్ చేసే దర్శకులకు బాగా అల్లరి చేసే యాక్టర్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆ దర్శకులకు తిప్పలు తప్పవు. ఎందుకంటే ఒకటి ఆ యాక్టర్స్ అల్లరి భరించాలి.. లేదా దర్శకులు కూడా వాళ్లలో కలిసిపోవాలి. ఒక్కోసారి ఇది సాధ్యం కాదేమో అనిపించవచ్చు. కానీ కొందరు ముద్దుగుమ్మలు అది సుసాధ్యమే అంటుంటారు. తాజాగా మెగాస్టార్ దర్శకుడికి అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిందట స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. కేవలం ఆచార్యకు సంబంధించి 15రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.

ఎప్పుడైతే ఆచార్య షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తెలిసిందో.. అప్పటినుండి సినిమా పై రోజురోజుకి అంచనాలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. విజయవంతమైన దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి - రాంచరణ్ సంయుక్తంగా ఆచార్యను నిర్మిస్తున్నారు. అయితే ఆ మధ్య అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్స్ అన్ని ఒక్కసారిగా ప్రకటించి సర్ప్రైజ్ చేసారు మేకర్స్. ఇప్పటికే ఆచార్య టీజర్, లాహే లాహే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవలే డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు జరుపుకున్నాడు. సోషల్ మీడియాతో పాటు సినిమా వాళ్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే హీరోయిన్ పూజాహెగ్డే మాత్రం క్రేజీ పిక్స్ షేర్ చేసింది. కొరటాల శివతో కలిసి దిగినటువంటి ఫోటోస్ పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. అలాగే కొరటాలకు ఫోటోస్ దిగటం అంటే ఇష్టం ఉండదని.. కానీ తన బలవంతం మీదనే ఫోటోస్ దిగాడని చెప్పుకొచ్చింది. పూజా అంటే ఎల్లప్పుడూ కెమెరా ముందు కనిపించేందుకు ఇష్టపడుతుంది. మరి కొరటాల కనీసం సెల్ఫీ తీసుకునే ఇంటరెస్ట్ కూడా చూపరు. అందుకే ఆమె అల్లరితో ఇలా డైరెక్టర్ తో పిక్స్ దిగిందని అర్ధమవుతుంది. అన్నట్టు ఆచార్యలో రాంచరణ్ జోడిగా పూజాహెగ్డే నటిస్తుంది. ఈ సినిమాలో పూజా ట్రైబల్ లేడీగా కనిపించనుందని లేటెస్ట్ ఫోటోస్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం పూజా కొరటాల ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.