Begin typing your search above and press return to search.
పెళ్లాడవేమీ బుట్టబొమ్మా అని అడగలేదా బామ్మగారూ?
By: Tupaki Desk | 3 Jun 2021 9:30 AM GMTటాలీవుడ్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న పూజా హెగ్డే ఏమాత్రం తీరిక సమయం చిక్కినా తన కుటుంబ సభ్యులతో తన పూర్తి సమయాన్ని గడిపేందుకు ఆసక్తిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత ఏడాది తనకు ఎంతో ఇష్టమైన గ్రాండ్ మదర్ ని కోల్పోయిన పూజా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తనకు ఏ కష్టం వచ్చినా తనతోనే చెప్పుకుని బాధపడేదానిని బామ్మ గారు వెంటనే క్లియర్ చేసేసేవారని తెలిపారు.
ఇప్పుడు తన తాతమ్మతో ఉన్న ఫోటోని షేర్ చేసి పూజా తన హ్యాపీ మూడ్ ని షేర్ చేశారు. బుధవారం రాత్రి పూజా తన బామ్మతో కలిసి ఉన్న ఒక కొత్త చిత్రాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అమ్మమ్మ నాయనమ్మలతో పూజా అనుబంధం ఎంతో గొప్పదని ఈ ఫోటోలు తన ఎమోషన్ చూస్తేనే అర్థమవుతోంది. తన బామ్మతో సంతోషంగా కనిపిస్తోంది పూజా. ఈ ఫోటో చూడగానే.. పెళ్లాడవేమీ బుట్ట బొమ్మా అని అడగలేదా బామ్మగారూ? అంటూ అభిమానులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.
బామ్మ గారు కుర్చీ మీద రిలాక్సవ్వగా పూజా నేలమీద కూర్చుంది. పూజా భుజాల మీదుగా ఆప్యాయంగా బామ్మ గారు చేతులు వేసి నవ్వులు చిందిస్తున్నారు. ``కొన్ని జ్ఞాపకాలు # సంతోషకరమైనవి`` అని పూజా ఈ ఫోటోకి వ్యాఖ్యను జోడించారు. మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం).. ఒక మాంటేజ్ వీడియోను పోస్ట్ చేసి.. తన జీవితంలో తనను `ప్రేరేపించిన` మహిళలందరికీ అంకితం చేసిన పూజా ఆ పోస్ట్ ని తన బామ్మగారికి కూడా అంకితం చేసింది.
నా జీవితంలో గౌరవప్రదమైన మహిళల సమక్షంలో ఎదగడం నా అదృష్టం. మంచిగా ఉండటానికి ప్రతి అడుగు నాకు స్ఫూర్తినిచ్చింది. నా జీవితంలో సానుకూలతను ధైర్యాన్ని జోడించి.. ఎల్లప్పుడూ నా పక్షాన ఉన్నందుకు ధన్యవాదాలు. బామ్మా నిన్ను ప్రేమిస్తున్నాను.. అని పూజా ఎమోషనల్ అయ్యారు.
13 అక్టోబర్ 1990 పూజా హెగ్డే బర్త్ డేట్. మహారాష్ట్ర ముంబైలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు మంజునాథ్- లతా హెగ్డే కూడా అదే నగరంలో పుట్టి పెరిగారు. కర్ణాటకలోని మంగుళూరు నుంచి ముంబైకి వలస వెళ్లిన కుటుంబమిది. పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే ఆర్థోపెడిక్ సర్జన్. అతను గిటారిస్ట్ గాయకుడు.. పార్ట్ టైమ్ మ్యూజిక్ కంపోజర్ కూడా.