Begin typing your search above and press return to search.
సభ్య సమాజానికి మంచి మెసేజే
By: Tupaki Desk | 17 Jun 2017 7:48 AM GMTముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఒక లైలా కోసం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈలోగా బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో రెక్కలు కట్టుకుని ముంబయికి ఎగిరిపోయింది. హృతిక్ రోషన్ లాంటి టాప్ యాక్టర్ పక్కన హీరోయిన్ గా అవకాశం వచ్చేసరికి పొంగిపోయింది. కానీ మొహెంజొదారో బాక్సాఫీస్ దగ్గర మొత్తంగా చతికిలపడింది. దీంతో మరోసారి లైమ్ లైట్ లోకి రావడానికి టాలీవుడ్ నే నమ్ముకుంది. దువ్వాడ జగన్నాథమ్ తో ఇండస్ట్రీని ఆకట్టుకుంటానని ఆశిస్తోంది.
‘ఇదిగో.. ఇలా.. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజీ ఇద్దామనుకుంటున్నావ్’ అంటూ దువ్వాడ జగన్నాథమ్ ను బెదరగొట్టిన సుందరాంగి పూజా హెగ్డే నిజ జీవితంలో సభ్య సమాజానికి మంచి మెసేజీ ఇస్తోంది. హీరోయిన్ గా రాణించాలంటే బాడీ స్లిమ్ గా ఉంచుకోవడం తప్పనిసరి. దాని కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇటీవల అత్యంత కష్టమైన హ్యాంగింగ్ పులప్స్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి నో ఎక్స్ క్యూజెస్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. నవ్వుతూ పులప్స్ తీసిన పూజా హెగ్డే పై సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.
ఒకలైలా కోసం, ముకుంద సినిమాలతో తనలో ఉన్న నటిని మనకు చూపించిన పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథమ్ లో అల్లు అర్జున్ తో పోటాపోటీ స్టెప్పులిస్తూ తను మంచి డ్యాన్సర్ అని కూడా నిరూపించుకుంటోంది. ఇప్పుడు ఫిట్ నెస్ విషయంలో తాను ఎంత హార్డ్ వర్కరో ప్రూవ్ చేసుకుంటోంది. టాప్ యాక్ట్రెస్ కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు. ఫిట్ గా, పర్ ఫెక్ట్ గా ఉండాలంటే ఎంత కష్టపడాలో చూపిస్తూ పూజా సమాజానికి మంచి మెసేజే ఇస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/