Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కఠిన యోగా చేస్తున్న బుట్టబొమ్మ!

By:  Tupaki Desk   |   9 April 2020 12:30 AM GMT
ఫోటో స్టోరీ: కఠిన యోగా చేస్తున్న బుట్టబొమ్మ!
X
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజియస్ట్ భామ. అసలే 'అల వైకుంఠపురములో' సినిమా సూపర్ హిట్ సాధించడంతో అప్పటికే ఉన్న క్రేజ్ కాస్తా డబల్.. ట్రిపుల్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఈ భామ మనందరిలాగే ఇంట్లో కూర్చుంది ఉంది. అయితే ఫిట్నెస్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బ్యూటీ కావడంతో తనకు తెలిసిన యోగాసనాలను వేస్తూ లాక్ డౌన్ తన కసరత్తులకు ఆటంకం కాదని.. కాబోదని.. ఎన్నటికీ అలా కానివ్వనని పంతం పట్టినట్టుగా ప్రవర్తిస్తోంది.

ప్రస్తుతం లైవ్ లో యోగా క్లాసులు హాజరవుతూ ఉందట. ఒక యోగాసనం వేస్తున్న ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యోగా ప్రాక్టీస్ చేస్తూ సమయం సద్వినియోగపరుస్తున్నాను. కండరాల పటుత్వాన్ని.. ఫ్లెక్సిబిలిటీని పెంచుకునేందుకు.. మనతో మనం కనెక్ట్ అయ్యేందుకు యోగా మనకు ఉపయోగపడుతుంది. లైవ్ క్లాసెస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ జోగ్ మిహిర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో స్పోర్ట్స్ వేర్ ధరించి తలక్రిందులుగా చేతులపై నిలుచుని కాళ్ళను గోడకు L షేపులో ఆన్చి మరీ ఆసనం వేసింది. "చట్టబద్ధం కాని హెచ్చరిక: అలవాటు లేకుండా ఇలాంటి ఆసనాలు వేయవద్దు. బాధ మరచి పోదామంటే మందు కూడా అందుబాటులో లేదు".

ఈ ఫోటోకు దాదాపు 500K లైక్స్ వచ్చాయి. ఎంతోమంది నెటిజన్లు పూజాను మెచ్చుకున్నారు. "అమేజింగ్ ఫిట్నెస్".. "పెళ్లి తర్వాత కదా ఇలాంటి పోజులు ఇవ్వాలి!".. "మేము వెంకీ ఆసన్ వేస్తున్నాం" అంటూ కొందరు స్పందించారు. ఇక పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.