Begin typing your search above and press return to search.
మాల్దీవుల నుంచి వైరస్ ని మోసుకొస్తావా? అవసరమా?
By: Tupaki Desk | 25 March 2020 4:30 AM GMT`బిగ్ బాస్2` బ్యూటీ పూజా రామచంద్రన్.. యూత్ గుండెల్లో కిల్లర్ గాళ్ అనడంలో సందేహం లేదు. లవ్ ఫెయిల్యూర్- స్వామిరారా- అడవి కాచిన వెన్నెల- దోచెయ్- త్రిపుర- కృష్ణార్జున యుద్ధం- వెంకీమామ- ఎంత మంచివాడవురా వంటి చిత్రాల్లో కీలక పాత్రలతో తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. సాధ్యమైనంత వరకు ఛాన్స్ దొరికినప్పుడల్లా తన హాట్ అందాల షో చేస్తూ కుర్రకారుకి బాగా దగ్గరైంది. మోడల్ నుంచి - వీడియో జాకీగా - అట్నుంచి నటిగా మారిన ఈ అమ్మడు తెలుగులోనే కాదు, తమిళం - మలయాళ సినిమాల్లో నటించి తన ప్రత్యేకతని చాటుకుంది. మొన్నటి వరకు బొద్దుగా - బబ్లీగా కనిపించి ఈ సోయగం ఒక్కసారిగా మారిపోయింది.
మొన్నటి వరకు తన జిమ్ బాడీని తలపించే ఫోటో షూట్ లతో రెచ్చిపోయింది. తాజాగా ఈ అమ్మడు తన భర్త జాన్ కక్కర్ తో కలిసి తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్యనో లేక ఏదైనా పెద్ద హోటల్ లోనో కాదు ఓ బీచ్ లో. అది కూడా ఏకాంతంగా కావడం విశేషం. ఈ హాట్ కపుల్ ఎవ్వరికి చెప్పకుండా మాల్దీవ్ లకు చెక్కేశారు. ఓ వైపు భర్తతో సమ్మర్ విహారయాత్ర.. మరోవైపు తన బర్త్ డేని మల్దీవ్ బీచ్ ల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చని ప్లాన్ చేసింది. అందుకే సైలెంట్ గా చెక్కేసింది. అయితే బర్త్ డే సెలబ్రేషన్ లో భాగంగా ఓ వైపు ఈ హాట్ కపుల్ సముద్ర తీరపు అందాలను అస్వాదిస్తూ... మరోవైపు ఒకరినొకరు హాట్ రొమాన్స్ చేసుకుంటూ బిజీ బిజీగా గడిపారు. తాజాగా ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి..., అభిమానులతో పంచుకుంది పూజా. ఆయా ఫోటోల్లో ఈ జంట హాట్ రొమాన్స్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే - దేశమంతా కరోనా వైరస్ కారణంగా వ్యక్తిగత దూరం పాటిస్తుంటే ఈ సెక్సీ భామ మాత్రం తన భర్తతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి టైమ్‌లో ఈ ఘాటు రొమాన్స్ అవసరమా? అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు ఆమెని ట్రోల్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా.. అక్కడ్నుంచి ఏ వైరస్ నో పట్టుకుని వస్తే పరిస్థితి ఏంటీ? అని మండి పడుతున్నారు.
మరోవైపు ఈ భామ తన సెలబ్రేషన్ గురించి పంచుకుంటూ, ``నీటి తరంగాలతో డాన్స్ చేయడం - సముద్రంతోపాటు కదిలాడటం.. నీటి రిథమ్‌కి మనలోని ఆత్మ ఫ్రీ అవ్వడం ఎంతో బాగుంది. ఇలాంటి ఎంజాయ్ ని ఎప్పుడూ పొందలేదు. ఈ ట్రిప్ నాకు చాలా ప్రత్యేకమైనది. సముద్రం వద్ద గడిపిన ఈ లైఫ్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇక్కడి కలర్ - ఈ అందం - చెపల కదలికలు - ఈ ప్రకృతి నమ్మలేని విధంగా ఉన్నాయి. మాల్దీవ్స్ ఈ ప్రపంచ అందంలో ఓ భాగం`` అని పేర్కొనడం విశేషం.