Begin typing your search above and press return to search.
పూజా ప్రేమ పెళ్లి.. విడాకులు..మళ్ళి ప్రేమ
By: Tupaki Desk | 31 Aug 2018 8:43 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో మెరుపు తీగలా వచ్చి వెళ్లి పోయిన పూజా రామచంద్రన్ అందరి దృష్టిని ఆకర్షించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో అడుగు పెట్టిన పూజా రామచంద్రన్ మొదటి రెండు వారాలు ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించింది. ప్రతి టాస్క్ లో కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాని ఆ తర్వాత కాస్త డల్ అయ్యింది. దానికి తోడు ఆమె ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడటంతో పాటు - కౌశల్ ఆర్మీ టార్గెట్ అవ్వడంతో తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయిన పూజా రామచంద్రన్ అందరిలాగే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.
పూజా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆమె గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. పూజా రెండు పెళ్లిల్లు చేసుకుందని కొందరు - మూడు పెళ్లిల్లు చేసుకుందని మరికొందరు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా తన వ్యక్తిగత విషయాలపై మీడియాలో వస్తున్న పుకార్లకు ఒక ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని - రెండున్నర సంవత్సరాల క్రితం అతడితో విడిపోయి అంటూ చెప్పిన పూజా ప్రస్తుతం తన జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది.
తెలుగులో నిఖిల్ ‘స్వామిరారా’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన పూజా రామచంద్రన్ తమిళ ఎస్ ఎస్ మ్యూజిక్ ఛానెల్ లో వీజేగా వర్క్ చేసింది. ఆ సమయంలోనే క్రెయిగ్ తో పరిచయం అయ్యింది. పరిచయం ప్రేమగా మారి వివాహంకు దారి తీసింది. పెళ్లి అయిన కొంత కాలంకే ఇద్దరం కలిసి జీవించలేం అని నిర్ణయించుకుని విడాకులు తీసుకుని స్నేహితులుగా ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరం కూడా విడి విడిగా జీవితాన్ని హాయిగా సాగిస్తున్నాం. ఇప్పుడు క్రెయిగ్ గురించి మాట్లాడాలని లేదు. మా విడాకులకు కారణం కూడా చెప్పాలని లేదు అంటూ పూజా తన ప్రేమ - పెళ్లి విషయంపై ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం నటుడు జాన్ తో ప్రేమలో ఉంది. ప్రస్తుతం అతడితో సహజీవనం కూడా సాగిస్తున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగులో జాన్ మూడు నాలుగు సినిమాల్లో నటించాడు.