Begin typing your search above and press return to search.

వీడియో: ఈ వ‌ర్క‌వుట్ చూస్తే చెమ‌ట‌లెక్కుతాయ్

By:  Tupaki Desk   |   18 March 2020 10:45 AM GMT
వీడియో: ఈ వ‌ర్క‌వుట్ చూస్తే చెమ‌ట‌లెక్కుతాయ్
X
న‌టి కం వీడియో జాకీ పూజా రామచంద్రన్ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. తెలుగు- తమిళం- మలయాళ ప‌రిశ్ర‌మల్లో పూజా బిజీ ఆర్టిస్టు. ఇక ఇంత బిజీలోనూ ఈ అమ్మడు సోష‌ల్ మీడియాల్లో ఫోటోలతో చెల‌రేగుతోంది. తాజాగా పూజా అందాల ఆర‌బోతకు సై అనేస్తోంది. తన భర్త జాన్‌ కొక్కెన్‌ తో కలిసి వేసవి వేడి తగ్గించుకునేందుకు ఇటీవ‌ల మాల్దీవ్ ల విహారానికి వెళ్ళింది మ‌రి.

ఇంకేం ఉంది అయితే అక్కడి బీచ్ ఇసుక‌లో సేద తీరడమే కాదు.. ఈ వెకేష‌న్ ని వ్య‌క్తిగ‌త ప్ర‌మోష‌న్స్ కి వాడుకుంటోంది. బీచ్ బికినీ ఫోటోలతో పూజా రెచ్చిపోయింది. బ్లాక్‌- పింక్‌ బికినీల్లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో పూజా పోజులిచ్చింది. తాజా ఫోటోలను చూస్తుంటే ఆమె అందాలను బంధించేందుకు కెమెరా ఫ్లాష్ లో తెగ పోటీప‌డ్డాయ‌ని అర్థ‌మ‌వుతోంది. పూజా ప‌ర్ఫెక్ట్ ఫిట్ గాళ్ అని ఈ ఫోటోల్ని బ‌ట్టి అర్థమవుతోంది. మొన్నటి వరకు చాలా బబ్లీగా కనిపించిన ఈ అమ్మడు ఒకేసారి ఇలా ఫిట్‌గా.. జిమ్‌ బాడీని తలపించేలా తయారు కావడంతో ఆమె అభిమానులు.. నెటిజనులు షాక్ కి గురవుతున్నారు. ఓ వైపు ఆశ్చర్యానికి గురవుతూనే.. మరోవైపు ఆమె అందాల ఆర‌బోత‌ను కళ్ళల్లో నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. ఏమాత్రం దాచుకోకుండా పూజా స్కిన్‌ షో చూస్తుంటే వేస‌వి సూర్యుడికే వేడి పుట్టించేలా ఉంది. ఇక నెటిజనుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలా. ఇక ఈ మ్యారీడ్ బేబీ థై షోస్‌ని ఫ్యాన్స్ వర్ణించేందుకు యూత్ డిక్షనరీలను వెతికే పనిలో పడ్డారనే చెప్పాలి. ఇక తాజాగా బిగినెర్స్ కోసం పూజా వ‌ర్క‌వుట్ల వీడియోని షేర్ చేసింది. ఈ వ‌ర్క‌వుట్లు ఎంతో సింపుల్ గా ఉన్నా.. చెమ‌ట‌లు ప‌ట్టించేలానే ఉన్నాయి. బెస్ట్ ఎక్స‌ర్ సైజుల్ని చాలా సింపుల్ గా వీడియో రూపంలో అందించేసింది. ఓవైపు బికినీ ఫోటోలు.. మ‌రోవైపు క‌స‌ర‌త్తుల వీడియోల‌తో చెల‌రేగుతోంది పూజా.

ఇక పూజా సోష‌ల్ మీడియాలో మ‌రీ అంతగా ట‌చ్ ల ఉండ‌డానికి కారణమేంటీ? సినిమా ఛాన్స్ లేనా అనే డౌట్‌ రావచ్చు. వేసవి నుంచి కాస్త సేద తీరడం ఓ ఎత్తైతే.. లేటెస్ట్ ట్రెండ్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు మరో కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే పూజాకు టాలీవుడ్ లో ఇటీవ‌ల‌ ఒక్క సినిమా కూడా లేదు. తాజా అందాల ప్రదర్శనతో గ్లామరస్‌ పాత్రలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని సాంకేతాలను మేకర్స్ కి ఇచ్చిన‌ట్ట‌య్యింది. `బిగ్‌బాస్‌ 2`లో పాల్గొని మరింత పాపులర్‌ అయిన ఈ భామ చివరగా తెలుగులో `ఎంత మంచి వాడవురా` చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. మరి ఆ అందాలను చూసి ఎవరైనా ఛాన్స్ లిస్తారేమో చూడాలి.