Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: జిగిబిగి జిగేల్ రాణీ
By: Tupaki Desk | 17 March 2019 9:43 AM GMTపది సెకన్ల నిడివి బికినీ సీన్ లో డీజే ఫ్యాన్స్ ని కళ్లు తిప్పుకోలేనంతగా షేక్ చేసింది.. ఆ తర్వాత జిగేల్ రాణీ (రంగస్థలం)గా ఐదు నిమిషాల ఐటెమ్ నంబర్ తో మెగా ఫ్యాన్స్ గుండెల్లో తిష్ట వేసి కూచుంది. వరుణ్ తేజ్, చైతన్య సినిమాల్లోనూ నటించి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఈ అమ్మడు. అందుకే మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటే ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. అది కూడా మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ల అభిమానుల్ని వేడెక్కించడమే ధ్యేయంగా బరిలో దిగుతోంది. ఇంతకీ ఎవరీ భామ? అంటే ప్రత్యేకంగా చెప్పాలా? జిగేల్ రాణీ పూజా హెగ్డే.
ప్రస్తుతం పూజా ఓవైపు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటించేస్తోంది. అరవింద సమేత తర్వాత.. మహేష్ సరసన మహర్షి చిత్రంలో నటించింది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ సరసన `జాన్` చిత్రంలో నటిస్తోంది. ఇవి రెండూ క్రేజీ సినిమాలే. ఆ సినిమాల్లో పూజా పాత్ర అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనుందట. ఆ క్రమంలోనే ముంబైలో ఈ అమ్మడి పార్టీల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
ముంబై లో ఖరీదైన ఫేజ్- 3 ఇలాకా జుహూలోని ఓ రెస్టారెంట్ నుంచి పూజా హెగ్డే బయటికి వస్తూ ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. చూడగానే కళ్లు జిగేల్మన్నాయిట. మిరుమిట్లు గొలిపే తళుకుబెళుకుల పర్పుల్ డ్రెస్ లో కనిపించింది. మేకప్ పరంగా అతి చేయకుండా చాలా సింపుల్ గా .. సహజసిద్ధంగా ఆకట్టుకుంది. పూజాలోని ఆ సింప్లిసిటీనే అభిమానులకు పిచ్చిగా నచ్చేస్తుందనడంలో సందేహం లేదు.