Begin typing your search above and press return to search.

12 ఏళ్ల వయసులో పూజా గుండె ముక్కలయ్యిందట

By:  Tupaki Desk   |   4 May 2022 7:30 AM GMT
12 ఏళ్ల వయసులో పూజా గుండె ముక్కలయ్యిందట
X
టాలీవుడ్‌ లో స్టార్ హీరోలతో సూపర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో సినిమాలను చేస్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో తాజాగా ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఈమె పాత్ర చిన్నదే కావడంతో ఆ సినిమా ప్లాప్ ఈమె కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. తాజాగా పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఆ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి కూడా హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం.. అభిమానం. ఆయన నటించిన కోయీ మిల్ గయా సినిమా ప్రీమియర్ కు ఏదోలా అవకాశం దక్కించుకుని వెళ్లాను. అప్పుడు నా వయస్సు పన్నెండు ఏళ్లు. కోయీ మిల్ గయా సినిమా ప్రీమియర్‌ సమయంలో ఆయనతో ఎలాగైనా ఫోటో దిగాలని భావించాను. అంతా ఫోటోలు దిగుతున్న సమయంలో నేను కూడా ఫోటో దిగేందుకు స్టేజ్‌ పైకి ఎక్కాను.

నేను స్టేజీ ఎక్కిన వెంటనే ఆయన ఏదో కారణం తో స్టేజీ దిగి వెళ్లి పోయాడు. ఆయనతో ఫోటో దిగాలని భావించిన నాకు ఆ సమయంలో గుండె ముక్కలయినంత బాధ కలిగింది. ఒక్క ఫోటో దిగలేక పోయాను అని బాధ పడ్డాను అంటూ హృతిక్ పై అభిమానం ను పూజా హెగ్డే తెలియజేసింది. అదే హృతిక్ రోషన్ తో తాను హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొహంజొదారో అనే భారీ సినిమాలో కలిసి నటించింది.

కష్టపడి తాను కోరుకున్న హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. తన అభిమాన స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తో కూడా సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి నటించబోతున్న సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. వచ్చే ఏడాదికి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక తెలుగు లో ఈమె సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబుతో త్రివిక్రమ్‌ తెరకెక్కించబోతున్న సినిమాలో ఈమె నటిస్తుంది. అంతే కాకుండా మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు లో ఈమె వరుస సినిమాలు చేస్తూ తమిళంలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే బీస్ట్‌ తో తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. త్వరలోనే మరో తమిళ సినిమాలో ఈమె నటించబోతుంది.