Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తో పెట్టుకుంటే అంతేగా..!

By:  Tupaki Desk   |   4 April 2020 6:11 AM GMT
ప‌వ‌న్ తో పెట్టుకుంటే అంతేగా..!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కితే అంతేగా! ఇక ఆ హీరోయిన్ అదృశ్య‌మే!! ఇదోర‌కంగా శాపం అన్న టాక్ ఇప్ప‌టికే ఉంది. ప‌రిశ్ర‌మ‌లో దీనిపై విస్త్ర‌తంగానే చ‌ర్చ సాగింది. ఇదివ‌ర‌కూ తీన్ మార్ బ్యూటీ కృతి క‌ర్భంద‌.. కొమరం పులి బ్యూటీ నికీషా ప‌టేల్ ఏమ‌య్యారో చూసిందేగా!

ప‌వ‌న్ తో న‌టిస్తే అగ్ర క‌థానాయిక‌లు అయిన‌ట్టేన‌ని బోలెడ‌న్ని హోప్స్ తో నాయిక‌లు ఎగిరిగంతేస్తారు. కానీ అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి... గ‌తం అందుకు ప్రూఫ్‌. ప‌వ‌న్ తో న‌టించాక‌.. ఈ భామ‌ల కెరీర్ డోలాయ‌మానంలో ప‌డిపోవ‌డం ఖాయం అని ప్రూవైంది. అజ్ఞాత‌వాసి బ్యూటీస్ కీర్తి సురేష్‌.. అను ఇమ్మాన్యుయేల్ సైతం అన‌వ‌స‌రంగా బుక్క‌యిపోయారు. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ప‌వ‌న్ సినిమాలు అయితే బంప‌ర్ హిట్లు.. లేదంటే డిజాస్ట‌ర్లు. అలా అన్ ల‌క్కీగా డిజాస్ట‌ర్ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకున్న భామ‌లంతా పెట్టే బేడా స‌ర్ధేశారు. అయితే ఒక్క గ‌బ్బ‌ర్ సింగ్ బ్యూటీ శ్రుతిహాస‌న్ కి మాత్రం ప‌వ‌న్ ఇచ్చిన లిఫ్ట్ ఓ రేంజులో వ‌ర్క‌వుటైంది. ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఇప్పుడు ఓ తెలుగ‌మ్మాయి గురించి కూడా అలాంటి టాకే న‌డుస్తోంది. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి చిన్నా చిత‌కా సినిమాల్లో న‌టించినా త‌న‌దైన అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంది పూజిత పొన్నాడ‌. ఈ అమ్మ‌డి వ‌య్యారం ముంబై భామ‌ల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించేస్తుంద‌నేది కుర్ర‌కారు న‌మ్మ‌కం. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో పూజిత పేరు మార్మోగింది. అటుపైనా సోలో లీడ్ గా ప‌లు చిత్రాల్లో న‌టించింది. న‌లుగురైదుగురు భామ‌లు ఉన్న సినిమాల్లోనూ వెలుగులు విరజిమ్మింది. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పీరియాడిక‌ల్ మూవీ పీఎస్.పీకే 27 లో ఈ అమ్మ‌డు ఓ స్పెష‌ల్ నంబ‌ర్ లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ఆ ప్ర‌త్యేక గీతాన్ని తెర‌కెక్కించేశార‌ని తెలుస్తోంది. ఇక ఇందులో త‌న‌కు కొన్ని సీన్లు కూడా ఉన్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ ద‌క్కినందుకు సంతోషించాలా లేక ఇంకేదైనా భావించాలా? అన్న క‌న్ఫ్యూజ‌న్ పూజాకు త‌ప్ప‌ద‌ని అంటున్నారు కుర్ర‌జ‌నం. మ‌రి స‌ద‌రు తెలుగ‌మ్మాయి ఏమ‌ని ఫీల‌వుతోందో ప‌ర్స‌న‌ల్ గా?