Begin typing your search above and press return to search.
లిప్ లాక్ కి నోనో అన్న తెలుగమ్మాయ్!
By: Tupaki Desk | 2 Jun 2019 11:53 AM GMTతెలుగమ్మాయిలు సైలెంట్ గా దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే `రంగస్థలం` ఫేం పూజిత పొన్నాడ కెరియర్ పరంగా దూసుకుపోతోంది. లఘు చిత్రాలతో మొదలై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. హవీష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `7`లో ఆరుగురు నాయికల్లో ఒక కథానాయికగా నటించింది. జూన్ 6న సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన టాలీవుడ్ ఎంట్రీ గురించి.. 7 మూవీ గురించి పలు ఆసక్తికర సంగతుల్ని చెప్పింది.
నేను తెలుగమ్మాయినే. కాలేజ్ చెన్నయ్ లో చదివాను కాబట్టి తెలుగులానే తమిళం మాట్లాడతాను. తొలుత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరియర్ ప్రారంభించాను. ఆ తర్వాత లఘు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అలా ఓ లఘు చిత్రంలో చూసి సుకుమార్ `రంగస్థలం` చిత్రంలో అవకాశం ఇచ్చారు. అందులో ఆది భార్య పాత్రలో నటించాను. అంతకుముందే `దర్శకుడు` అనే చిత్రంలో నటించాను. ప్రస్తుతం `7` మూవీలో ఒక కథానాయికగా నటించాను. లఘు చిత్రాలు చూసి నన్ను అందరూ ప్రోత్సహిస్తున్నారు. రంగస్థలం చిత్రాన్ని నచ్చి చేశాను. ఆ సినిమా తర్వాత ఇక కథానాయికగా మాత్రమే చేయాలని ఫిక్సయ్యాను. మంచి కథలు వస్తే అన్నిరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో చేయాలనుకుంటున్నా.. అని తెలిపారు.
`7` చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నా పాత్రను ఎక్కువ రివీల్ చేయలేను. అది సస్పెన్స్ తో కూడుకున్నది. ఒక లవ్ స్టోరిలో నా పాత్ర వస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే ఉన్న సినిమా..టు అంచుపై కూచుని చూసేంత ఉత్కంఠగా ఉండే థ్రిల్లర్.. ఇందులో ఆరుగురు కథానాయికలు ఉన్నా.. ఎవరూ ఎవరికీ సంబంధం లేకుండానే కనిపిస్తారు. ప్రతి హీరోయిన్ కి ఒక ప్రేమకథ ఉంటుంది. ఒక కథతో ఇంకో కథకు సంబంధం ఉండదు. చివరిగా క్లైమాక్స్ లో ఈ కథలన్నీ మెర్జ్ అవుతాయి. దర్శకుడు నిజార్ షఫీతో ఇదివరకూ ఓ చిత్రంలో కలిసి పని చేశాను. అతడు మంచి ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంతో దర్శకుడిగానూ నిరూపించుకుంటున్నారు.. అని తెలిపింది. హీరో హవీష్ డెడికేషన్ కి వావ్ అనిపించిందని అన్నారు.
లిప్ లాక్ వేసేందుకు అభ్యంతరం లేదా? అన్న ప్రశ్నకు.. వద్దనే అనుకుంటున్నా. సందర్భం సరైనది అయితే .. కథ డిమాండ్ చేస్తే ఆలోచిస్తానని తెలిపారు. ఇదివరకూ దర్శకుడు అనే చిత్రంలో తెలుగమ్మాయి కావాలనుకునే నాకు అవకాశం ఇచ్చారు. ఏదో యాక్సిడెంటల్ గా కాకుండా తెలుగమ్మాయే కావాలనుకుని అడిగితే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు పెరిగాయని పూజిత వెల్లడించారు.