Begin typing your search above and press return to search.

#MAAelection: 'మా' ఎన్నికలపై పూనమ్ కౌర్, బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   10 Oct 2021 8:44 AM GMT
#MAAelection: మా ఎన్నికలపై పూనమ్ కౌర్, బండ్ల గణేష్ హాట్ కామెంట్స్
X
'మా' ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 1.30 వరకు 56శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. క్యూలైన్ లో ఇంకా 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో మరో గంట పాటు పోలింగ్ ను పొడిగిస్తున్నట్టు ఎన్నిక అధికారి తెలిపారు. మా ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం నటుడు , నిర్మాత బండ్ల గణేష్, నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

-మర్డర్లు మానభంగాలేమీ జరగడం లేదు కదా?: బండ్ల గణేష్
మా ఎన్నికల వేళ జీవిత రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలోనే ఓటు వేసి వస్తున్న బండ్ల గణేష్ ను చూసి మీడియా జర్నలిస్టులంతా ఆయన వద్దకు పరిగెత్తారు. జీవిత మాట్లాడుతున్నా వదిలేసి బండ్ల గణేష్ వైపు వెళ్లడం విశేషం. దీన్ని బట్టి మీడియాలో బండ్ల గణేష్ కు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. 'పోలింగ్ కేంద్రంలో గొడవ జరుగుతోందట?' అన్న ప్రశ్నకు బదులిచ్చారు. 'మర్డర్లు, మానభంగాలు అయితే జరగడం లేదు కదా?' అని విలేకరులకు కౌంటర్ ఇచ్చాడు. కామ్ గా బ్రహ్మాండమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు.. 26మందిలో 26 మంది తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారని.. కావాలంటే రాసిస్తానని తెలిపారు. తాను ఓటేసిన వ్యక్తులే గెలుస్తారని కౌంటర్ ఇస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

-ప్రకాష్ రాజ్ కు ఓటేశానన్న పూనమ్ కౌర్
మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎవరికి సపోర్టు చేస్తున్నానో చెప్పని ఈ భామ తాజాగా 'తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ కే ఓటు వేశానని' డైరెక్టుగానే చెప్పింది. మా ఎన్నికల్లో రాజకీయాలు వద్దని చెప్పింది.