Begin typing your search above and press return to search.

పీకే అర్థం చెప్పొచ్చుగా పూనమ్

By:  Tupaki Desk   |   5 Sep 2018 7:56 AM GMT
పీకే అర్థం చెప్పొచ్చుగా పూనమ్
X
టాలీవుడ్ కు చాన్నాళ్ల క్రితమే హీరోయిన్ గా పరిచయమైన పూనమ్ కౌర్ సరైన సక్సెస్ లేక వెనుకబడి తక్కువ టైంలో తెర మరుగు కావడంతో ప్రేక్షకులకు మరీ అంత సుపరిచితమైన పేరు కాలేక పోయింది. అడపాదడపా హీరో చెల్లిగా గోపిచంద్ శౌర్యం లాంటి సినిమాల్లో పాత్రలు చేసిన పూనమ్ చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ మధ్య రేగిన వివాదం కారణంగా వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ జరిగిన రోజుల్లో మనస్థాపానికి గురైన పూనమ్ కొంత కాలం బ్రేక్ తీసుకుంది. ఇటీవలే టీవీతో పాటు సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చేసింది. బాహుబలి నిర్మాతలు ఒక ఛానల్ కోసం రూపొందిస్తున్న స్వర్ణఖడ్గంలో కీలక పాత్ర చేస్తుండగా శ్రీనివాస కళ్యాణంలో రాశి ఖన్నా అక్కయ్యగా కాస్త పరిధి ఉన్న పాత్రనే దక్కించుకుంది. కృష్ణాష్టమి సందర్భంగా పూనమ్ చేసిన ఒక ట్వీట్ మరో సారి చర్చకు దారి తీసింది. అందులో ఒక మెసేజ్ లో కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రేమతో సంతోషంతో ఒక వీడియో చేసానని అది హృదయానికి దగ్గరైన వాళ్ళ కోసమంటూ పోస్ట్ చేసింది.

అసలు ట్విస్ట్ ఏంటంటే మెసేజ్ చివర్లో హ్యాష్ ట్యాగ్ చేస్తూ పీకే లవ్ అని పెట్టింది. అంతే అది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించింది అని భావించిన కొందరు అభిమానులు కామెంట్స్ రూపంలో మాటల దాడి మొదలుపెట్టేసారు.తక్కువ టైంలోనే పూనమ్ స్పందిస్తూ తాను ఎంత బాగా చేసినా చేయని తప్పుకు మాటలు పడాల్సి వచ్చిందని నాకు దగ్గరైన ఆ వీడియోను పెట్టనని చెప్పేసింది. మళ్ళి ఏమనుకుందో కానీ 38 సెకండ్లు ఉన్న చిన్న వీడియోని పెట్టేసింది. అందులో గోపిక వేషంలో ఉన్న పూనమ్ సముద్ర తీరంలో పాల కడలిని తన చిన్ని కడవలో ఎత్తుకోవడం తప్ప ఏమి లేదు. ఈ మాత్రం దానికి పీకే లవ్ అని యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టిందో అర్థం కాలేదు. అందరి దృష్టిని మరోసారి తిప్పుకోవడం కోసమా లేక ఇంకేదైనా కారణమా తెలియదు కానీ పీకేకు అర్థం ఏంటో చెబితే సరిపోయేదిగా. కానీ అది మాత్రం ఇంకా గుట్టు విప్పడం లేదు పూనమ్.