Begin typing your search above and press return to search.

స్టైల్ మార్చిన హైదరాబాద్ బ్యూటీ

By:  Tupaki Desk   |   9 Aug 2017 7:34 AM GMT
స్టైల్ మార్చిన హైదరాబాద్ బ్యూటీ
X
సాధారణంగా తెలుగు హీరోయిన్లు గ్లామర్ గా కనిపించడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేల కనిపించినా సక్సెస్ అయినా వారు చాలా తక్కువ మందే ఉన్నారు. దీంతో అతిగా చేస్తే మొదటికే మోసం వస్తుందని అపుడప్పుడు కాస్త హాట్ ఫీచర్స్ తో మాత్రం కుర్రాళ్ళ మనసులను దోచేసుకుంటారు.

ఇప్పుడు అదే తరహాలో ఓ హైదారాబాదీ ముద్దుగుమ్మ కనిపించడానికి ప్రయత్నిస్తోంది. 2006 లో నుంచి తెలుగు టాలీవుడ్ లో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న పూనమ్ కౌర్ 2016 ఎటాక్ సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు. మొదట్లో అడపాదడపా క్యారెక్టర్లు చేస్తూ.. వచ్చిన ఈ ముద్దుగుమ్మ 2008 లో గోపీచంద్" శౌర్యం" సినిమాలో హీరో చెల్లెలి పాత్రను చేసింది. ఆ సినిమాతో ప్రశంసలు అందుకున్న పూనమ్ కి ఆఫర్ల బాగానే వచ్చాయి. ముఖ్యంగా కన్నడ - తమిళ్ లో సైడ్ హీరయిన్ గా కూడా అలరించింది. ఇక బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. కానీ వచ్చిన సినిమాలన్నీ చిన్నవే కావడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఆమెకు రాలేదు.

అయితే పూనమ్ ఇప్పుడు తన స్టైల్ ని కాస్త మార్చింది. ఎన్నడూ చూడని విధంగా తన లుక్ లో కనిపిస్తోంది. అందుకు కారణం ఆమెకు మంచి అఫర్ దక్కిందట. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కథను మలుపు తిప్పే క్యారెక్టర్ దొరికిందట. ఆ సినిమాలో సందీప్ కిషన్ - తమన్నా కూడా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా పూనమ్ జాతకం మారుతుందో లేదో చూడాలి.