Begin typing your search above and press return to search.
ఈటల రాజేందర్ పై పూనమ్ కౌర్ కామెంట్స్
By: Tupaki Desk | 19 Nov 2021 2:30 PM GMTటాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఏదో ఒక విషయంపై రియాక్ట్ అవుతుంటుంది. ఎవరి మీదనో ఒకరిపై కామెంట్లు చేస్తుంటుంది. ఎందుకు కామెంట్లు చేస్తుంది అనే విషయాలు కూడా అర్థం కావు. తాజాగా గురునానక్ జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్, వేసిన కామెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
హుజూరాబాద్ లో బైపోల్ లో ఈటల రాజేందర్ గెలుపు చారిత్రాత్మకమన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాజాగా పూనమ్ స్పందించింది. ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా కలిసింది పూనమ్ కౌర్. శాంతికపోతమైన పావురాన్ని ఈటల రాజేందర్ తో కలిసి ఎగరవేసింది. అలా శాంతికి చిహ్నమైన తెల్లని దుస్తుల్లో కనిపించిన పూనమ్ కౌర్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా కలిసిన పూనమ్ కౌర్.. గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది. ధర్మ యుద్ధం ఎప్పుడూ గెలుస్తుందంటూ ఈటల రాజేందర్ విజయంపై స్పందించింది.
రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. శాంతికి చిహ్నమైన పావురాలను ఇలా వదిలేద్దామని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. నిబద్దత, కమిట్ మెంట్, మంచివాళ్లను బాబా నానక్ ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారనంది. ఆయనే నా నమ్మకం, ఆయన నా చుట్టూ ఉన్నారని.. నన్ను రక్షిస్తుంటారని చెప్పుకొచ్చింది.
మొత్తానికి పూనమ్ కౌర్ ఇలా కనిపించడంతో నెటిజన్లు కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ కొంపదీసి బీజేపీలో చేరుతుందా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.