Begin typing your search above and press return to search.
ఇన్ని పంచ్ లు ఎవరి మీద పూనం?
By: Tupaki Desk | 16 April 2018 6:42 AM GMTనేను ఏమైనా అంటా. ఎందుకంటే.. భావస్వేచ్ఛ రాజ్యాంగం నాకిచ్చిన హక్కు అన్నట్లు వ్యవహరిస్తుంటారు కొందరు. మనకు తోచినట్లు మనం నాలుగు మాటలు అన్నప్పుడు.. అవతలోడు సైతం రెండు మాటలు అనకుండా ఉంటారా? అందునా ఇప్పుడు నడుస్తోంది డిజిటల్ యుగం. నోట్లో నుంచి మాట రానోళ్లు సైతం.. చేతలతో రాసేసే రాతలతో భగ్గుమనే పరిస్థితి.
చేతిలో సినిమాలు లేకున్నా.. అనుకోని రీతిలో వార్తల్లోకి వచ్చింది పూనంకౌర్. తీర్చిదిద్దినట్లుగా ఉండే అందాలతో చూడముచ్చటగా ఉండే ఈ భామకు అవకాశాలు ఎందుకు రావో ఒక పట్టాన అర్థం కాదు. అన్ని ఉన్నా.. అదృష్టం తక్కువన్నట్లుగా ఉంటుంది పూనంను చూసినప్పుడు. టాలెంట్ కు కొదవ లేని ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇందులో చాలా విషయాల్నే చెప్పింది. ఆ మధ్యన ఆమె మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సిఫార్సుతో ఏపీ సర్కారు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ను చేసిందని.. ఆమె ఆసుపత్రి బిల్లుల్ని పవన్ పే చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్లేమీ ప్రస్తావించకుండా నర్మగర్భంగా పంచ్ ల మీద పంచ్ లు వేసింది పూనం. వినేందుకు బాగానే ఉన్నా.. అన్ని పంచ్ లకు బదులుగా కాస్త క్లారిటీ ఇచ్చి పంచ్ లు వేస్తే బాగుండేది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పూనం విసిన పంచ్ లు చూస్తే..
+ ఆయుధాలు లేని వాళ్లతో యుద్ధం చేయకూడదని చెబుతారు. నేను నిఖార్సైన సిక్కు యువతిని. ఏ వ్యక్తి అయినా ఓ అమ్మాయితో పోరాటం చేస్తున్నాడంటే అతడు బలహీనుడని అర్థం. మహిళలపై దాడులు చేసే బలహీనుల్ని నేను పట్టించుకోను. బలహీనులతో యుద్ధం చేయకూడదని గురు గోవింద్ చెబుతారు.
+ దిగజారిపోయిన వ్యక్తే మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. మోసం చేయాలనుకుంటాడు. అలా అని నేను తిరగబడి కక్ష సాధించేందుకు పూలన్ దేవిని కాదు కదా?అందుకే మోసం చేసేవాళ్లని దేవుడే చూసుకుంటాడని నమ్ముతా
+ గురు గోవింద్ మాటల్ని చూస్తే.. నేను పోరాడుతున్నప్పుడే నా బలం ఏమిటో తెలుస్తుంది. ఎవరికీ హాని కల్గించే పనిని నేను చేయను. నాతో యుద్ధం చేయ్. ఏం జరుగుతుందో జరుగుతోందని అనుకుంటాను. మిమ్మల్ని ఒకసారి కొడితే నొప్పి అనిపిస్తుంది. మళ్లీ.. మళ్లీ కొడితే నొప్పికి మీరు అలవాటు పడతారు. నా విషయంలోనూ అదే జరిగిందని అనుకుంటాను.
+ ఎవరైనా బలహీనతలతో ఆడుకోవటం.. అమ్మయి జీవితంతో ఆడుకోవాలని అనుకోవటం చాలా తప్పు. అలాంటివారు కచ్ఛితంగా శిక్ష అనుభవిస్తారు. స్వామీజీలుగా బయటకు కనిపించిన వాళ్లు కూడా జైళ్లల్లో ఉన్నది అందుకేగా?
+ నేను ఎవరి నాశనాన్ని కోరుకోను. అలాంటి వాళ్లు మారాలని.. వారిలో మార్పు రావాలని కోరుకుంటా. నేను ఎవరి సాయాన్ని కోరుకోను. స్వతంత్రంగా బతుకుతున్నా. నా ఆత్మను ఎప్పటికి అమ్ముకోను. వ్యక్తిత్వంతో ఉన్నా. సమాన హక్కులను నమ్ముతా. నేను నికార్సైన సిక్కు మహిళను. అమాయకుల జీవితాలతో ఆడుకోవటమే సోషల్ మీడియాలో కొందరి పని.