Begin typing your search above and press return to search.

రాజకీయ నాయుకులపై పూనమ్ చేసిన ట్వీట్ వైరల్...!

By:  Tupaki Desk   |   8 May 2020 4:00 PM GMT
రాజకీయ నాయుకులపై పూనమ్ చేసిన ట్వీట్ వైరల్...!
X
విశాఖపట్నంలో ఎల్‌ జీ పాలిమర్స్‌ నుంచి విష వాయువు లీకైన దుర్ఘటన ప్రజలందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. యావత్ భారతదేశాన్ని ఈ ఘటన షాక్ కి గురి చేసింది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అఖిల్ - నాని - కళ్యాణ్ రామ్ - వరుణ్ తేజ్ - అల్లు శిరీష్ - మారుతి - అనిల్ రావిపూడి - తమన్నా మొదలైన వారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. చికిత్స తీసుకుంటున్న వారికి మంచి వైద్యం అందించాలని వారు అధికారులను కోరారు. ఎప్పుడు ఏదొక ట్వీట్ తో వార్తల్లో ఉండే పూనమ్ కౌర్ విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. రాజకీయ నాయకులపై పూనమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పూనమ్ కౌర్ విశాఖ దుర్ఘటనపై స్పందిస్తూ.. 'రాజకీయ నాయకులమని చెప్పుకునే వ్యక్తులు.. పేద ధనిక, అవినీతి, అవినీతి రహిత - నిజాయితీ గల వారు, ద్వేషపూరితమైన ప్రతీ ఒక్క నాయకులు కలిసి రండి.. రాష్ట్రాన్ని కాపాడండి. చెత్త ఎన్నికల్లో మీరు పెట్టే శ్రమలో సగం ఇప్పుడు పెట్టండి.. మీరు చేసిన కర్మలన్నీ తొలగిపోతాయ' అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా 'ప్రియమైన నాయకులారా.. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు బయటకు రండి.. మీకు అవసరమున్నప్పుడే కాదు.. సమయం ఇదే.. మీ డబ్బు - ఇళ్లు - ఫామ్స్ - మీ భద్రతే రాష్ట్రానికి కావాలా.. విశాఖ ఘటన దృశ్యాలు చూస్తే ఎంత బాధగా ఉందో తెలుస్తోందా.. తల్లి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తలదాచుకోవడానికి పరుగెత్తుతోంది. ప్రజలకు మీ అవసరం ఇప్పుడు ఉంది.. ప్రజల కోసం పోరాడండి' అంటూ మరో ట్వీట్‌ చేసింది. ఇప్పుడు పూనమ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారికి - గాయపడిన వారికి - చికిత్స అందుకుంటున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించింది. చుట్టు పక్కల ఉన్న గ్రామాలందరికీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించి 30 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.