Begin typing your search above and press return to search.
మూగవోయిన సరస్వతీ గానము
By: Tupaki Desk | 20 Sep 2018 1:30 AM GMTవివాదాస్పద ట్వీట్లతో ఇటీవల పూనమ్ టాలీవుడ్ లో వేడి పెంచిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ - కత్తి మహేష్ ఎపిసోడ్స్ లో పూనమ్ పేరు ప్రముఖంగా మార్మోగిపోయింది. జనసేనానిని సపోర్ట్ చేస్తూ - కత్తి మహేష్ కి వ్యతిరేకంగా పూనమ్ ట్వీట్లు చేయడం చర్చకొచ్చింది. అదంతా అటుంచితే పూనమ్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల్లేవ్.
బుల్లితెరపై రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇదివరకూ బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న టీవీ సిరీస్ లో అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సిరీస్ కి ఆశించిన స్థాయి రేటింగులు లేవన్న టాక్ వినిపించింది. మరోవైపు బాలీవుడ్ లో బిపాసా బసు హబ్బీ కరణ్ సింగ్ గ్రోవర్ సరసన ఓ అవకాశం అందుకుందని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే దానికి సంబంధించిన తాజా వివరం ఇంతవరకూ తెలియరాలేదు.
ఆ క్రమంలోనే ఇదిగో వీణ పట్టుకుని ఇలా సరస్వతీదేవిలా ప్రత్యక్షమైంది. చదువులతల్లి వీణ వాయిద్యము విని తీరాల్సిందేనని యూత్ ఫిక్సయిపోతున్నారంతే. ఈ గెటప్‌లో పూనమ్ ధరించిన ఆ చేనేత చీరను ప్రత్యేకంగా పరిశీలించాలి. ఇదివరకూ తెలుగు దేశం ప్రభుత్వం పూనమ్ ని చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అందుకే ఇలా ఇంకా చేనేతకు ప్రాచుర్యం తెస్తోందా.. అన్న సందేహం కలగకమానదు. తేదేపా సపోర్టర్ గా పూనమ్ ట్రోలింగ్ కి గురవ్వడం అప్పట్లో చర్చకొచ్చింది.