Begin typing your search above and press return to search.
ఆదుకోవాలని...ఆ వెంటనే డైలమాలో పూనం!
By: Tupaki Desk | 8 Jan 2018 8:33 AM GMTటాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్ రేపిన వివాదంలో ఇప్పుడు హీరోయిన్ పూనం కౌర్ విలవిల్లాడుతున్నారని చెప్పక తప్పదేమో. ఎందుకంటే... కొన్ని రోజుల క్రితం క్రిటిక్ హోదాలో రంగంలోకి దిగేసిన కత్తి మహేశ్ వరుసగా టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ స్పందించకున్నా... పవన్ ఫ్యాన్స్ మాత్రం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. సదరు రిప్లై సాఫీగా కాకుండా బెదిరింపులకు దిగినట్లుగా ఉండటంతో దానిని ఆసరా చేసుకున్న కత్తి మహేశ్ మరింతగా రెచ్చిపోయారనే చెప్పాలి. అయితే అటు పవన్ కు మద్దతుగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా - ఫోన్ల ద్వారా కత్తి మహేశ్ కు హెచ్చరికలు జారీ చేస్తుంటే... మరికొందరు కత్తి మహేశ్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో హీరోయిన్ గానే కాకుండా ఏపీ సర్కారు చేత చేనేత అంబాసిడర్ గా నియమింపబడ్డ పూనం కౌర్ మొన్న ఓ క్రిటిక్ అంటూ చేసిన వరుస ట్వీట్లు పెద్ద కలకలమే రేపాయి.
ఈ ట్వీట్లను ఆసరా చేసుకుని తనదైన శైలిలో మరోమారు రంగంలోకి దిగేసిన కత్తి మహేశ్... ఏకంగా పవన్ తో పూనంకు లింకు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాదులోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద - ఆ తర్వాత దాదాపుగా అన్ని టీవీల్లో కత్తి మహేశ్... పూనంకు సంధించిన ప్రశ్నలు పెద్ద కలకలమే రేపాయి. టీవీల్లో రాత్రి పొద్దుపోయేదాకా డీబేట్లు సాగాయి. అయితే రాత్రి 9.30 గంటల సమయంలో మహా టీవీ వేదికగా జరిగిన చర్చా వేదికకు కత్తి మహేశ్ హాజరు కాగా... టాలీవుడ్ డైరెక్టర్ - రచయిత వివేక్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు సంధించే హక్కు ఎవరిచ్చారు? అన్న కోణంలో వివేక్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కత్తి మహేశ్ చర్చ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఈ చర్చకు తెర పడిందిలే అనుకుంటుండగా... నేటి ఉదయం పూనం సోదరుడు శ్యాంసింగ్ బయటకు వచ్చేశారు. తన సోదరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన ప్రకటించారు.
ఆ కాసేపటికే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన పూనం... ఈ వివాదం నుంచి తనను బయటపడేయాలని పవన్ కల్యాణ్ ను అభ్యర్థిస్తూ వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. తనను తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని కాపాడాలంటే పవన్ కల్యాణ్ స్పందించాల్సిందేనని ఆమె ఆ ట్వీట్లలో పవన్ ను అభ్యర్థించారు. అంతేకాకుండా కొందరు రహస్య ఎజెండా పెట్టుకుని మాట్లాడుతున్నారని, తాను మాత్రం రాజకీయంగా టార్గెట్ కాదలచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్వయంగా వచ్చి మిమ్మిల్ని కలుస్తానంటూ ఆమె పవన్‌ను ఆ ట్వీట్లలో కోరారు. అయితే ఏమైందో తెలియదు గానీ... సదరు ట్వీట్లను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఐదు నిమిషాలకే వాటిని పూనం డిలీట్ చేసేశారు. దీంతో ఇది ఇప్పుడు మరింత జఠిలంగా మారిందనే చెప్పాలి. కత్తి మహేశ్ కోరితే... స్పందించని పవన్ కల్యాణ్... వివాదం ఇంతగా ముదిరాక మాత్రం తాను కోరితే స్పందిస్తారా? అన్న అనుమానంతో పూనం వాటిని డిలీట్ చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.