Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ మీద బాంబ్ పేల్చిన పూనమ్...!

By:  Tupaki Desk   |   17 Jun 2020 12:30 PM GMT
స్టార్ డైరెక్టర్ మీద బాంబ్ పేల్చిన పూనమ్...!
X
పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా బాంబ్ పేల్చింది. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న వ్యక్తిపై వరుసగా సెన్సేషనల్ ట్వీట్స్ పెడుతూ వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఆమె తరచూ వైరాగ్యంతో కూడిన ట్వీట్లు చేస్తుండటంతో ఎవర్ని ఉద్దేశించి చేస్తుంది.. ఎందుకు చేస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతూ వచ్చాయి. ఎప్పుడూ ఇండైరెక్ట్ గా ఏదో అర్థం వచ్చేలా ట్వీట్స్ పెడుతూ వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ ఇప్పుడు డైరెక్ట్ గానే ఆ స్టార్ డైరెక్టర్ ని ఎటాక్ చేసింది. టాలీవుడ్ లో అతని స్నేహితుడైన స్టార్ హీరోని అతడి భార్యను దూరం చేసాడని.. అతని ప్రతిష్టని దెబ్బతీసాడని.. అతని పక్కన చేరి స్లో పాయిజన్ లా అతన్ని అంతం చేయాలని చూస్తున్నాడని విమర్శించింది.

పూనమ్ ట్వీట్ చేస్తూ.. ''నీ ఫ్రెండ్ తను ప్రేమించే భార్య దగ్గరకి వెళ్లకుండా అడ్డుకున్నావ్. నువ్వు వారి మధ్యలో రావడం వల్లనే అతను అందరితో తిట్లు తింటున్నాడు. పిల్లలు సఫర్ అవుతున్నారు. ఆమె బాధ పడుతూనే ఉంది. అతను బాధ పడ్డాడు. ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేసావ్.. స్లో పాయిజన్ లాగా అతన్ని చంపాలని చూస్తున్నావా'' అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ''మీ స్వలాభం కోసం మీ ఫ్రెండ్ జీవితాన్ని మానిప్యులేట్ చేసావ్. మీలాగా అతని లైఫ్ నుండి వేరే ఎవరు కూడా ప్రయోజనం పొందారని నేను అనుకోను. యువర్ మానిప్యులేటివ్.. యూ ఆర్ సిక్'' అంటూ #guruji హ్యాష్ ట్యాగ్ పెట్టి మరో ట్వీట్ చేసింది.

అంతేకాకుండా ''మా ఫ్రెండ్ ఒకసారి కాదు రెండుసార్లు మూడుసార్లు పూనమ్ బాగాలేదని.. ఆమె పూర్తిగా అనారోగ్యం పాలైందని.. ఆమెకు ఏమైనా చేయగలమా అని నిన్ను సంప్రదించాడు. అప్పుడు ఆ డైరెక్టర్ తప్పించుకొనే ధోరణిలో మాట్లాడాడు. ఇప్పుడు నేను ఏమి చేయాలని బాధ పడ్డాను. నేను మళ్ళీ ఈ పరిస్థితిని పరిష్కరించగలవా అని అతనిని అడిగాను. నేను ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాను అని చెప్పాను. అప్పుడు ఆ డైరెక్టర్ 'నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఒక రోజు వార్త అవుతావు. అంతకుమించి ఏమీ జరగదు' అని అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. నాపై నాకు జాలేసింది'' అని వెల్లడించింది.

మీడియాని, మూవీ మాఫియాని, ప్రకటనలని కూడా అతను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తన మీద ఆన్ లైన్ మీడియాలో నెగెటివ్ ఆర్టికల్స్ రాయించాడని.. దీంతో మరింత కృంగిపోయి తాను డిప్రెషన్‌ కి గురయ్యానని చెప్పుకొచ్చింది. అయితే దానికి నేను గట్టిగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చానని చెప్పింది. అర్థరాత్రి అయినా నీకు ప్రాబ్లమ్ ఉంటే వస్తానని చెప్పే దగ్గర నుండి నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ అవుతావు' అనే వరకు మన మన జర్నీ సాగింది. సీరియస్ గా అసలు నేను ఎందుకు బాగులేను..? సినిమా క్యాస్టింగ్ లిస్ట్ నుండి నా నేమ్ తీసేసావ్.. సినిమా ఆడియో ఫంక్షన్స్ లో పాల్గొన్న నా పిక్స్ లేకుండా చేసావ్'' అని పూనమ్ ట్వీట్ చేసింది.

స్టేజ్ మీద సావిత్రి గారి గొప్పదనం గురించి ఆ వ్యక్తి మాట్లాడతాడని.. కానీ లోకల్ టాలెంటుని ఎప్పుడూ ఎంకరేజ్ చేయడని.. పైగా అందరూ అందమైన హీరోయిన్‌ గా గుర్తించిన అమ్మాయిని తన పని తాను చేసుకోనివ్వకుండా ఆపడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించింది పూనమ్. ఆ డైరెక్టర్ కి మంత్రుల కొడుకులు, పెద్ద కుటుంబాల వాళ్లు తెలిస్తే ఏంటని.. అతను కేవలం మ్యానుపులేటర్ అని చెప్పుకొచ్చింది పూనమ్. ఆ ఒక్క ఇష్యూని పరిష్కరించమని అతన్ని అడిగానే తప్ప మళ్ళీ అతన్ని ఈ విషయంలోనూ సంప్రదించలేదు. మంత్రులని ఫ్రెండ్స్ ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావ్. నువ్వు భజన తప్ప మరేమీ చేయలేదు. నన్ను సైలెంటుగా బ్యాన్ చేయాలని చూసావ్. అది ఓకే. కానీ నువ్వు #guruji కాదు'' అని ట్వీట్ చేసింది. ఎక్కడా ఆ డైరెక్టర్ పేరు చెప్పకపోయినా పూనమ్ ఎవరిని టార్గెట్ చేస్తోందన్నది అందరికి తెలిసిందే. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సెలబ్రెటీల డిప్రెషన్ గురించి పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తనకు ఆ డైరెక్టర్ మూలంగా ఎదురైన మానసిక సమస్యల గురించి ట్వీట్లతో చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. మరి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న అతను ఎలా స్పందిస్తాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.