Begin typing your search above and press return to search.

ఆ సన్నాసి వల్ల మీ అన్న జీవితం నాశనం అయింది : పూనమ్

By:  Tupaki Desk   |   20 Jun 2020 1:30 AM GMT
ఆ సన్నాసి వల్ల మీ అన్న జీవితం నాశనం అయింది : పూనమ్
X
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన అన్యాయం జరిగిందని ఓ స్టార్ డైరెక్టర్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు టాలీవుడ్‌లో తనకు జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేసుకుంటూ.. ఆమె డిప్రెషన్ కి లోనవడానికి ఆ డైరెక్టర్ ఎలా కారకుడయ్యాడని వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆ డైరెక్టర్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ ఆ డైరెక్టర్ ని ఆయన అభిమానులు పిలుచుకునే పేరుని మెన్షన్ చేయడంతో అతనెవరేది అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. నెటిజన్స్ కి పూనమ్ ఇచ్చిన సమాధానాలు మరింతగా వైరల్ అవుతున్నాయి.

కాగా పూనమ్ ట్వీట్స్ లో ఆ డైరెక్టర్ పేరు ప్రస్తావించకపోయినా.. కొన్ని ప్రసార మాధ్యమాలు డైరెక్టర్ త్రివిక్రమ్‌ పైనే పూనమ్ ఆరోపణలు చేసిందని రాశారు. పూనమ్ మీడియా అటెన్షన్ కోసమే నిందారోపణలు చేస్తోంది అని పేర్కొన్నారు. దీంతో పూనమ్ ఆ ప్రసార మాధ్యమాలపై సెటైర్స్ వేసింది. 'అది నింద కాదు. బ్లడీ ట్రూత్' అంటూ.. 'ఆ డైరెక్టర్ ఎంత ఇచ్చాడంటూ' కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఓ మీడియాపై ఛలోక్తులు విసురుతూ.. వారికి అన్నీ ముందుగానే తెలుస్తాయని కౌంటర్స్ వేసింది. ''అందరి పర్సనల్ అఫైర్స్, సినిమా సెట్స్ లో ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తారో.. హీరో లైఫ్ లోకి వచ్చిన ఏ అమ్మాయి బ్రాండ్ న్యూ కారు కొనుగోలు చేసింది? ఎలా? ఇలాంటి విషయాలన్నీ వారికి తెలుస్తాయని ట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన ఓ నెటిజన్ దీనిపై లీగల్‌గా పోరాడాలని సలహా ఇచ్చాడు. దీంతో పూనమ్‌ ఘాటుగా రియాక్ట్ అయింది. ''మీ అన్న చెప్పారా? ఆయన ఓడిపోతే హ్యాపీగా ఉందా? ఆయన ఇన్సుల్త్ అయింది హ్యాపీగా ఉందా? చెప్పండి. మూడు పెళ్లిళ్లు అని అవమానిస్తుంటే హ్యాపీగా ఉందా? ఆ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైందని తెలియాలి.. నమస్తే'' అంటూ ట్వీట్ చేసింది. అయితే వీటిపై మరో నెటిజన్ స్పందిస్తూ ఇది ఓల్డ్ న్యూస్ అంటూ తీసి పారేశాడు. దీనికి పూనమ్ ''అమ్మాయిల బాధలు మీకు పాత వార్తల్లా ఉంటాయ్.. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి'' అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై 'మా' లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండని సలహా ఇవ్వగా.. 'మా' కంప్లైట్స్ తీసుకోదని సమాధానం చెప్పింది. మరి పూనమ్ ఆ డైరెక్టర్ ని ఇప్పుడు 'సన్నాసి' అంటూ వ్యాఖ్యానించడం ఎక్కడిదాకా దారి తీస్తుందో చూడాలి.