Begin typing your search above and press return to search.
వాన వల్లప్ప వల్లప్ప..మండే మోటివేషన్ అదిరిందే!
By: Tupaki Desk | 20 April 2020 5:30 PM GMTటాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. సినిమాల ద్వారా సాధించిన పాపులారిటీ కంటే పూనం కొన్ని వివాదాల కారణంగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. వ్ విషయం పక్కన పెడితే పూనం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వ్యక్తి. ఇప్పుడు లాక్ డౌన్ సమయం కదా అని సోషల్ మీడియాకు దూరంగా జరిగి డిప్రెషన్లో మునిగి పోయే వ్యక్తి అసలు కానే కాదు. సహజంగా సోమవారం అంటే చాలామంది డల్ గా ఉంటారు. ఆఫీసు లేకపోయినా సరే చాలామందిలో నీరసం కనిపిస్తూ ఉంటుంది. పూనం కౌర్ అలాంటి వారికి 'మండే మోటివేషన్' అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది.
టీవీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అన్నయ్య' సినిమాలోని 'వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్ సామిరంగా' పాట ప్లే అవుతూ ఉంటే పూనం ఉత్సాహంగా టీవీ ముందు నిలబడి డాన్స్ చేస్తూ సౌందర్య వేసే స్టెప్స్ ను అనుకరిస్తూ ఉత్సాహంగా రెచ్చి పోయింది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి "సోమవారం ప్రేరణ ఇది.. సౌందర్య గారిని తలుచుకుంటూ.. లెజెండ్స్ వేసిన డాన్సింగ్ స్టెప్పులను మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా... నన్ను తిట్టుకోకండి బాబూ.. ఊరికే జనాలను ఉత్సాహ పరచడానికి అంతే. లవ్ యు ఆల్.#స్టే హోం స్టే సేఫ్ #స్టే హ్యాపీ #మెగాస్టార్ #అన్నయ్య" అంటూ ట్వీట్ చేసింది.
డాన్స్ లో పూనం పెద్దగా మ్యాచ్ చేయలేకపోయింది గాని ఉత్సాహం విషయంలో మాత్రం రఫ్ఫాడించేసింది. చాలామంది సెలబ్రిటీలు ఏదో ఒక రకంగా నెటిజన్లను ఉత్సాహపరచడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.. కొందరు తీవ్రమైన కసరత్తులు చేస్తూ కసరత్తులు సందేశం ఇస్తూ ఉంటే.. కొందరేమో హాటు ఫోటోల సందేశం ఇస్తున్నారు.. పూనం మాత్రం మెగా మోటివేషన్ ఇచ్చింది. దీన్ని ఫాలో అయ్యేందుకు చట్టబద్ధమైన హెచ్చరిక అవసరమే లేదు. మీ డాన్స్ మరి నీచంగా ఉంటే చూసే వాళ్ళు చస్తారు.. రెచ్చిపోయి వేసేయండి.