Begin typing your search above and press return to search.
'అవినీతి'పై #pklove ట్యాగ్ తో పూనమ్ చేసిన ట్వీట్స్ వైరల్ ...!
By: Tupaki Desk | 13 Jun 2020 2:30 PM GMTటాలీవుడ్ లో సినిమాలతో కంటే వివాదాలతో బాగా గుర్తింపు పొందిన హీరోయిన్ పూనమ్ కౌర్. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అవుతున్నా క్రేజీ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ అడపాదడపా సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి 'స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధం లేని అంశాలపై స్పందిస్తూ వార్తల్లో ఉంటుంది. డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా ట్వీట్లు చేస్తుండటంతో ఎవర్ని ఉద్దేశించి చేస్తుంది.. ఎందుకు చేస్తుంది అని అందరూ చర్చించుకునేలా చేస్తుంది. అయితే అమ్మడికి సినిమా అవకాశాలు లేకపోవడం వల్లనే మీడియా అటెన్షన్ కోసం ఏదొక ఇష్యూలో వేలు పెడుతూ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల శ్రీరెడ్డిపై ఇండైరెక్ట్ గా ట్వీట్స్ చేస్తూ వచ్చిన పూనమ్ ఫ్యాన్స్ అమాయకులంటూ ట్వీట్ చేసింది. ఇలా ప్రతి విషయంలో కలుగజేసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి ఎప్పుడో దూరమైన ఈ అమ్మడు అందరూ తన గురించి మాట్లాడుకోవాలని ట్వీట్స్ పెడుతూ ఉంటుందని కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు కరోనా కలవరపడుతున్న సమయంలో కూడా పూనమ్ డైలీ ఏదొక ట్వీట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పూనమ్ కౌర్ 'కరప్షన్' అనే అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
''అవినీతి గురించి కొందరు చెప్పిన అభిప్రాయాలు బాగానే ఉన్నాయి. అయితే మనకందరికీ ఇన్ని విషయాలు తెలిసి కూడా అవినీతి రహితులకు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నాం'' అని ట్వీట్ చేసింది పూనమ్. అంతేకాకుండా "నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవినీతి మచ్చలేని వ్యక్తులు మనకు నేతలుగా పనికిరారా..? ఎందుకు..? సమాధానం చెప్పండి. దేశం మొత్తాన్ని అడుగుతున్నాను. అవినీతికి పాల్పడని నేతలను మనం ఎందుకు గెలిపించడం లేదు? మంచివాళ్లు రాజకీయాల్లో నెగ్గలేకపోతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి" అంటూ మరో ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన ఒక నెటిజన్ ''ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి మేడం'' అని కామెంట్ చేయగా దీనిపై స్పందించిన పూనమ్ ''మార్పు కోరుకుంటే ఫస్ట్ మీలో మార్పు రావాలి.. దీన్ని ప్రజలపైకి నెట్టడం ఆపండి.. మార్పు కోసం మీరు ఏమి చేస్తున్నారు..?'' అని ప్రశ్నించింది. అయితే పూనమ్ ఇప్పుడు సడన్ గా 'అవినీతి' పై ట్వీట్ చేయడానికి కారణం ఏంటి.. ఇప్పట్లో ఎలక్షన్స్ కూడా లేవు.. అలాంటిది పూనమ్ కి ఇప్పుడు అవినీతి గుర్తుకు వచ్చిందో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పూనమ్ ఇప్పుడు అటెన్షన్ కోసం 'కరప్షన్' వైపు గాలిని మళ్లించిందని.. అందులోనూ ఈ ట్వీట్స్ కి కూడా 'పీకే లవ్' అనే హ్యాష్ ట్యాగ్ ఎందుకు జత చేసిందో అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు.