Begin typing your search above and press return to search.
పూనమ్ కౌర్ కౌంటర్ ఎవరి మీద?
By: Tupaki Desk | 6 Dec 2020 12:03 PM GMTటాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్లతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఈ టాలీవుడ్ నటి కొన్ని సినిమాల్లో నటించి ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనే కనిపిస్తుంటుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. కొన్ని సార్లు పవన్ కు అనుకూలంగా.. మరికొన్ని సార్లు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేసింది.
తాజాగా మరోసారి పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో ముడిపడ్డ ఓ అంశంపై ఆమె మాట్లాడింది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆ వ్యాఖ్యల గురించి పెద్ద చర్చే నడిచింది. ఆయనపై పవన్ ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులు విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. రైతుల బాధల గురించి ఆయన మాట్లాడారు.
దీనిపై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ‘ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు అయిన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే పెద్ద చర్చనీయాంశం అయ్యాయని.. అవి పతాక శీర్షికలు ఎక్కాయని.. కానీ ఏ పక్షపాతం లేకుండా.. రాజకీయ అజెండా లేకుండా రైతుల గురించి మాట్లాడితే ఎవరూ పట్టించుకోవట్లేదని.. ఇది హిపోక్రసి కాదా’ అని పూనమ్ ప్రశ్నించింది.
దీనిపై ప్రకాష్ రాజ్ సైతం స్పందించారు. వాళ్లు తమ అజెండా ప్రకారం అంతా చేస్తున్నారని ట్వీట్ చేశారు. తర్వాత పూనమ్ స్పందించారు. రాజకీయ అజెండాకు తాను కూడా బాధితురాలినే అని వ్యాఖ్యానించారు. పవన్ పేరెత్తకుండా ఆయనకు సంబంధించిన విషయంలో పూనమ్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.