Begin typing your search above and press return to search.
పూనమ్.. ఉగాదికి అలా.. రంజాన్ కు ఇలా..!
By: Tupaki Desk | 14 April 2021 10:30 AM GMTటాలీవుడ్ లో సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయింది పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్. 'మాయాజాలం' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూనమ్ కెరీర్ ఆశించిన విధంగా కొనసాగలేదు. అడపాదడపా సినిమాలు చేసింది కానీ ఏవి కూడా అమ్మడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ, తనకు సంబంధం లేని అంశాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యవహారం అంటూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన పూనమ్.. ఇండస్ట్రీలో గురూజీ అని పిలిపించుకునే టాప్ డైరెక్టర్ వల్ల తన కెరీర్ నాశనం అయిందని చెప్పి సంచలనం రేపింది. ఇలా ఎప్పుడూ ఏదొక విధంగా వార్తల్లో ఉండే ఈ బ్యూటీ.. ఉగాది - రంజాన్ పండుగల నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
పూనమ్ కౌర్ నిన్న రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఓ ట్వీట్ వేసి శుభాకాంక్షలు తెలిపింది. అయితే అదే సమయంలో నిన్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీని గురించి ఓ నెటిజన్ పూనమ్ ని ప్రశ్నించాడు. ఉగాదికి మాత్రం ట్వీట్ వేయలేదు.. రంజాన్ కు మాత్రం వేశావ్ అంటూ వేలెత్తి చూపాడు. దీనిపై స్పందించిన పూనమ్.. ''ఉగాది లేదా వైశాఖి కి నేను విష్ చేయలేదు. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో అమాయకమైన రైతులు నిరసనలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ మనం వారి పండుగను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటాం. నేను ఎలా విష్ చేస్తాను. ఒకవేళ చేసినా అది ఫేక్ అవుతుంది. ఉగాదికి విష్ చేస్తున్నప్పుడు మీరు రైతుల గురించి, వారి బాధల గురించి ఆలోచించారా?'' అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.