Begin typing your search above and press return to search.
నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ బయటపెడతా: పూనమ్ కౌర్
By: Tupaki Desk | 2 Oct 2021 6:31 AM GMT'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు రసవత్తరంగా జరుగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో అక్టోబర్ 10న జరగబోయే ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 'మా' అధ్యక్ష పదవి కోసం ఈసారి నలుగురు సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారు. హీరో విష్ణు మంచు - నటుడు ప్రకాష్ రాజ్ - సి.వి.ఎల్. నరసింహరావు మరియు కె. శ్రావణ్ కుమార్ అధ్యక్ష బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. దీంతో మరో వారంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు సినీ నటి పూనమ్ కౌర్ తెలిపారు. అప్పుడే తాను ఇంతకాలం నిశబ్దంగా ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందని పూనమ్ అన్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ తో కలిసి దిగిన ఓ ఫొటోని పంచుకుంటూ ట్వీట్ చేసింది.
''#మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ సార్ గెలవాలని కోరుకుంటున్నాను. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను నిశబ్దంగా ఎదుర్కొన్న సమస్యలను బయటపెడతాను. అతను మాత్రమే నిజాయితీగా ఉంటాడు. చిల్లర రాజకీయాలు చేయరు. పెద్దల పట్ల గౌరవంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. జైహింద్'' అని పూనమ్ కౌర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, 'మాయాజాలం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్.. 'శౌర్యం' 'గగనం' 'శ్రీనివాస కల్యాణం' సహా పలు చిత్రాల్లో మెప్పించారు. ప్రకాష్ రాజ్ నిర్మించిన 'గగనం' చిత్రంలో నటించిన పూనమ్.. 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో ఆయన కూతురి పాత్రలో కనిపించింది.