Begin typing your search above and press return to search.

బంక‌మ‌ట్టిలో పూన‌మ్ కౌర్ యోగా సెష‌న్స్

By:  Tupaki Desk   |   13 May 2021 4:30 AM GMT
బంక‌మ‌ట్టిలో పూన‌మ్ కౌర్ యోగా సెష‌న్స్
X
క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించేందుకు సెల‌బ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. శ‌రీరంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ ని పెంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సెకెండ్ వేవ్ వైర‌స్ ప్ర‌మాద‌క‌రంగా మార‌డంతో జాగ్ర‌త్త పెరిగింది. నిత్యం వ్యాయామాలు..వాకింగ్ లు చేస్తూ..మంచి డైట్ తీసుకుంటూ ఆరోగ్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో కూడా కొంద‌రు సెల‌బ్రిటీలు మాత్రం క‌రోనాని కూడా ప్ర‌చారానికి వాడుకుంటున్నారన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

క‌రోనా పేరుతో కొంద‌రు క‌థానాయిక‌ల ప‌బ్లిసిటీ స్టంట్ క‌ళ్ల ముందే క‌నిపిస్తోంది. తాజాగా పంజాబీ బ్యూటీ పూన‌మ్ కౌర్ అందుకు భిన్న‌మైన ప్ర‌య‌త్న‌మే చేశారు. బంక‌మ‌ట్టి- బుర‌ద నీటిలో త‌న స్నేహితుల‌తో క‌లిసి యోగాస‌నాలు ప్రాక్టీస్ చేస్తూ.. పూన‌మ్ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో యోగా సెష‌న్ కొన‌సాగించారు.

పూన‌మ్ కి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. తాజాగా షేర్ చేసిన బంక‌మ‌ట్టిలో యోగాసెష‌న్స్ ఫోజులు వైర‌ల్ గా మారాయి. ఒంటికి యోగా మేలు.. మ‌ట్టితో మ‌లినాల శుభ్ర‌త‌కు మార్గ‌మిదే అంటూ పూన‌మ్ ప్ర‌చారం చేస్తోంది. ఇక సినీకెరీర్ ప‌రంగా చూస్తే.. పూన‌మ్ కౌర్ కెరీర్ ఒడిదుడుకుల గురించి తెలిసిన‌దే. ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల వివాదాల‌తో సోష‌ల్ మీడియాల్లో పాపులారిటీని పెంచుకున్న పూన‌మ్.. అభిమానుల‌కు త‌న‌లోని ఆధ్యాత్మ‌క కోణాన్ని ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుత క‌రోనా లాక్ డౌన్ లో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.