Begin typing your search above and press return to search.

హాటీ పూన‌మ్ పాండేని వేధించిన భ‌ర్త‌!

By:  Tupaki Desk   |   23 Sep 2020 2:30 AM GMT
హాటీ పూన‌మ్ పాండేని వేధించిన భ‌ర్త‌!
X
కొత్తగా పెళ్లి చేసుకున్న నటి పూనం పాండే తనపై వేధింపులకు పాల్పడ్డాడని.. చంపేస్తాన‌ని బెదిరించాడని భ‌ర్త సామ్ బొంబాయిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. దక్షిణ గోవాలోని కెనాకోనా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం పాండే ఒక చిత్రం షూటింగ్‌లో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు.

బాలీవుడ్ శృంగార తార‌గా పూనమ్ సుప‌రిచితం. ఇటీవ‌ల సినిమాల్లేవ్. ఆ క్ర‌మంలోనే పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. తాజా ఎటాక్ తో పూనమ్ పాండే భర్త సామ్ బొంబాయిని గోవాలో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

``తన భర్త సామ్ బొంబాయి తనను వేధింపులకు గురిచేశాడని ఆమెపై దాడి చేసిన తరువాత భయంకరమైన ప్ర‌వ‌ర్త‌న‌తో తీవ్రంగా బెదిరించాడని సోమవారం పాండే ఫిర్యాదు చేశాడు. అతన్ని అరెస్టు చేశాం`` అని కెనకోనా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తుకారాం చవాన్ చెప్పారు. బాధితురాలు తప్పనిసరి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.