Begin typing your search above and press return to search.

పోర్న్ కూడా ఓకే అన్నట్లే.. చెప్పేసింది

By:  Tupaki Desk   |   22 Feb 2017 9:21 AM GMT
పోర్న్ కూడా ఓకే అన్నట్లే.. చెప్పేసింది
X
సోషల్ మీడియాతో ఉపయోగించుకొని సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకున్నోళ్లను వేళ్ల మీదనే లెక్కపెట్టొచ్చు. అందం అన్నది పక్కన పెడితే.. అందాల్ని కనువిందుగా షో చేస్తూ.. కుర్రాకారుని పిచ్చెక్కించటమే కాదు.. తన బోల్డ్ మాటలతో తరచూ వార్తల్లో నిలిచే చిన్నది పూనమ్ పాండే. వివాదాస్పద వ్యాఖ్యలు.. విచ్చలవిడిగా అందాల ప్రదర్శన ఆమె తర్వాతే.

హాట్ హాట్ ఫోటోలు.. వీడియోలతో కవ్విస్తూ.. కలవరపెట్టే ఆమె ఎప్పుడు ఎలాంటి పోస్టుల్ని పెడుతుందో అర్థం కాని తీరులో ఉంటుంది. ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియాను వాడేసుకొని.. ఇమేజ్ ను మరింత పెంచేసుకుంటే ఉంటుంది.

ఇష్టారాజ్యంగా ప్రదర్శించే ఆమె అందాల్ని చూసి తన్మయత్వంలో మునిగిపోయే వారు కొందరైతే.. ఇన్ని చేస్తున్నావ్.. పోర్న్ సినిమాల్లో కూడా నటించేస్తే సరిపోతుందిగా అంటూ మాట్లాడే వారు మరికొందరు. ఇలాంటి ప్రశ్నలు పూనమ్ కు తరచూ ఎదురైనా.. ఆమె మాత్రం ఇప్పటివరకూ పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదని చెప్పాలి. తాజాగా.. ఆ ప్రశ్నకూ తనదైన శైలిలో సమాధానం చెప్పేసి షాకిచ్చింది.

తనకు పోర్న్ సినిమాలు చేసే దమ్ముందని.. కానీ.. చూసే ధైర్యం మీకుందా? అంటూ ఎదురుప్రశ్న వేసింది. పోర్న్ సినిమాల్లో చేసే రోజు వస్తే.. ఆ పని కూడా చేసేస్తానేమో అన్న ఆమె మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయినా.. పోర్న్ చేసేందుకు ఆమెకు ధైర్యం ఉన్నప్పుడు.. చూసే వాళ్లు చూడకుండా ఉంటారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/