Begin typing your search above and press return to search.

ఇంత చూపించినా పట్టించుకోరేంటి?

By:  Tupaki Desk   |   31 Aug 2015 1:47 PM GMT
ఇంత చూపించినా పట్టించుకోరేంటి?
X
బాలీవుడ్ లో ఓ సినిమా ఆడాలంటే అందులో షారుఖ్ అయినా ఉండాలి.. లేదా సెక్స్ అయినా ఉండాలి అంటుంటారు అక్కడి జనాలు. జిస్మ్, మర్డర్ లాంటి సినిమాలు ఇరగాడేసిన టైంలో పుట్టింది ఈ మాట. చాలా వరకు సెక్స్ ను నమ్ముకున్న సినిమాలు అక్కడ బాగానే ఆడాయి. కానీ కొన్ని బూతు సినిమాలకు దారుణమైన దెబ్బలు కూడా తగిలాయి. అలా దెబ్బతిన్న సినిమాల్లో.. ‘నషా’ ఒకటి. ట్విట్టర్ సెన్సేషన్ పూనమ్ పాండే తెరంగేట్రం చేసిన సినిమా ఇది. తెరమీద ఓ రేంజిలో శృంగారం ఒలకబోసింది పూనమ్. కానీ ఏం లాభం.. జనాలు పట్టించుకోలేదు. సన్నీ లియోన్, షెర్లిన్ చోప్రా లాంటి భామల సినిమాల్ని ఆదరించిన జనాలు.. తననెందుకు పట్టించుకోలేదో పూనమ్ కి అర్థం కాలేదు.

దీంతో బాలీవుడ్ మీద అలిగి.. టాలీవుడ్ కి వచ్చింది. ఇక్కడ మాలిని అండ్ కో అనే సినిమా చేసింది. ఒకప్పుడు ‘ఆరోప్రాణం’ లాంటి మంచి సినిమా తీసి.. ఆ తర్వాత బి-గ్రేడ్ సినిమాలకు పరిమితమైన వీరూ.కె ఈ సినిమాకు దర్శకుడు. నిర్మాత కేవలం పూనమ్ అందాల మీదే పెట్టుబడి పెట్టాడు. సినిమాలో కావాల్సినంత మసాలా ఉందంటూ కొంచెం గట్టిగానే ప్రచారం చేశారు. పూనమ్ స్వయంగా వచ్చి హైదరాబాద్ రోడ్ల మీద టికెట్లు కూడా అమ్మి హడావుడి చేసింది. ఇక సినిమాలో పూనమ్ ఎలా రెచ్చిపోయిందో చెప్పాల్సిన పని లేదు. అయినా జనాలు ఈ సినిమాను పట్టించుకోలేదు. కొందరు శృంగార ప్రియులు థియేటర్ వైపు ఓ లుక్కేశారు కానీ.. మెజారిటీ ఆడియన్స్ ‘మాలిని అండ్ కో’ను పట్టించుకోలేదు. దీంతో పూనమ్ కష్టమంతా వృథా అయిపోయింది. తాను ఇంతగా విప్పి చూపిస్తున్నా జనాలు తన సినిమాల్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాక పూనమ్ తెగ ఫీలైపోతోందట పాపం.