Begin typing your search above and press return to search.

చితకబాదిన భర్త.. నటి పూనమ్ కు తీవ్రగాయాలు.. అసలేమైందంటే?

By:  Tupaki Desk   |   9 Nov 2021 6:57 AM GMT
చితకబాదిన భర్త.. నటి పూనమ్ కు తీవ్రగాయాలు.. అసలేమైందంటే?
X
మోడల్, నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తపై తనను దారుణంగా కొట్టాడని పూనమ్ ఆరోపించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సామ్ ను అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి మూడు రోజుల కస్టడీకి పంపింది.

భర్త దాడిలో తీవ్రగాయాల పాలైన పూనమ్ ను ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తదుపరి విచారణ జరుగుతోంది. దీంతో అసలు ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న పూనమ్ పాండేను సామ్ బాంబే రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 10న వీరిద్దరూ వివామ బంధంతో ఒక్కటయ్యారు. దీని తర్వాత ఇద్దరూ గోవా వెళ్లారు. కానీ అక్కడ కూడా పూనమ్, సామ్ మధ్యచాలా గొడవలు జరిగాయి.

నటి పూనమ్ పాండే గోవాలో తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పెళ్లయిన 12 రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు రావడంతో ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పెళ్లయిన కొద్దిరోజులకే పూనమ్ కు భర్త సామ్ నుంచి శారీరక వేధింపులు, బెదిరింపులు, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో కేసులు పెట్టింది. సామ్ తనపై దాడి చేసి బెదిరించాడని ఆమె గోవాలో ఫిర్యాదు చేసింది. అప్పుడు పూనమ్ గోవాలో షూటింగ్ లో ఉంది. ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేయడంతో బెయిల్ వచ్చింది. దీంతో విడాకులు తీసుకోనున్నట్టు పూనమ్ ప్రకటించింది.

తర్వాత పూనమ్, సామ్ రాజీపడ్డారు. సజావుగా వీరి సంసారం సాగింది. అయితే తాజాగా సామ్ మొదటి భార్య అల్విరా విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో సామ్ కోపంతో పూనమ్ ను కొట్టడం ప్రారంభించాడు. కోపంతో జట్టు పట్టుకొని పూనమ్ తలను నేలకేసి కొట్టాడని.. ఆమె ముఖంపై కూడా కొట్టాడని చెబుతోంది.

ఈ క్రమంలోనే పూనమ్ పాండేకు తీవ్రగాయాలయ్యాయి. ఒక కన్ను, ముఖంపై తీవ్రగాయమైంది. పూనమ్ కు కనిపించడం లేదని తెలిసింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు.

ఇది మొదటి సారి కాదని.. చాలా సార్లు కొట్టి సారీ చెప్పాడని.. కానీ ఈసారి మాత్రం హత్య చేసినంత దారుణంగా హింసించాడని పూనమ్ తెలిపింది. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పటిల్ లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు అంటూ కన్నీళ్ల పర్యతం అయ్యింది.