Begin typing your search above and press return to search.

నానుంచి స్పైసీ ఆశిస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 Aug 2015 9:34 AM GMT
నానుంచి స్పైసీ ఆశిస్తున్నారా?
X
వలువలు ఒలిచి పబ్లిక్‌ లో పందేరం పెట్టడానికి ఎప్పుడూ ముందుంటుంది పూనమ్‌ పాండే. బికినీ, టూపీస్‌, పొట్టి నిక్కర్లతో ఎక్స్‌ పోజింగ్‌ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించింది అమ్మడు. నిరంతరం వివాదాలతో చెలిమి చేయడం ఈ అమ్మడికే చెల్లింది. అయితే ఇటీవలి కాలంలో చడీ చప్పుడు చేయక బుద్ధిగా కనిపిస్తోంది.

పూనమ్‌ ఓ తెలుగు సినిమాలో కూడా నటించేసింది. వీరూ.కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పేరు 'మాలిని అండ్‌ కో'. ఇప్పటికే తన దర్శకుడితో కలిసి ప్రచారం జోరుగానే సాగించింది. ఈ శుక్రవారమే థియేటర్లలోకి సినిమా రిలీజవుతోంది కాబట్టి కొన్ని ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించిందిలా.

మొదటిసారి చెట్టు, పుట్ట పట్టుకుని సాంగ్స్‌ వేసుకున్నా. అది కూడా ఓ తెలుగు సినిమా కోసం. బాగా ఎంజాయ్‌ చేశా. అయితే ప్రేక్షకులు నానుంచి పద్ధతైన దుస్తులు ఆశించరు. బికినీలు, టూపీసుల్లో హాట్‌ గా కనిపిస్తానే అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో అలాంటి కంటెంట్‌ ఉండదు. ఇదో పూర్తి డిఫరెంట్‌ రోల్‌. కొత్త రూపంలో కనిపిస్తా అని చెప్పింది.

అయినా ఇకనుంచి సీరియస్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నా. అవకాశం ఇస్తే మిగతా హీరోయిన్ల కంటే బాగా నటించి చూపిస్తానని దర్శకనిర్మాతలకు సవాల్‌ విసురుతోంది.