Begin typing your search above and press return to search.

నా బూతు వీడియోలు చూస్తూ నన్నే ట్రోల్స్ చేయడానికి సిగ్గులేదా?

By:  Tupaki Desk   |   6 March 2022 10:30 AM GMT
నా బూతు వీడియోలు చూస్తూ నన్నే ట్రోల్స్ చేయడానికి సిగ్గులేదా?
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనం పాండే మరో సారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమె కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ అనే రియాల్టీ షోలో పాల్గొన్నది. ఆ సందర్భంగా కంగనా తో బోల్డ్ గా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన రిలేషన్ గురించి మాట్లాడటం తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పూనం పాండే షో లో షేర్‌ చేసుకుంది.

ఆ సమయంలో పూనం పాండే మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలకు చాలా గట్టిగా సమాధానం చెప్పింది. తాను చేసిన వీడియోలకు నెలకు మిలియన్ ల కొద్ది వ్యూస్‌ వస్తాయి. రాత్రంతా ఆ వీడియోలను చూసిన వారే ఆ తర్వాత నన్ను సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ చేసేవారు నా అన్ని వీడియోలను చూసిన వారే అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ షోలో కంగనా రనౌత్ అడిగిన పలు ప్రశ్నలకు అంతకు మించి బోల్డ్ గా ఆమె సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది. కంగనా రనౌత్ షో అంటేనే బోల్డ్ గా ఉంటుంది అని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

అలాంటి సమయంలో పూనం పాండే అంతకు మించి బోల్డ్ గా సమాధానాలు చెప్పడం తో షో మరింత బోల్డ్ గా మారింది. సోషల్ మీడియా లో తను రెగ్యులర్ గా విమర్శలు చేసేవారు.. ట్రోల్ చేసేవారు తాను చేసే ప్రతి ఒక్క వీడియో ని కూడా చూశారు అంటూ ఆమె విమర్శించింది.

రాత్రంతా నేను చేసిన వీడియోలను చూసిన వారు ఉదయం సమయంలో అలాంటి వీడియోలు నువ్వు ఎందుకు చేస్తున్నావ్ అంటూ సోషల్ మీడియాలో నీతులు చెబుతూ ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వారికి నా గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించింది. అవతలి వారి గురించి మాట్లాడేప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలని హితవు పలికింది.

నా బట్టలు విప్పుకొని నా బాడీ చూపించినంత మాత్రాన నేను చెడి పోయినట్లు కాదు.. నా వీడియో లు చూసి నన్ను విమర్శించిన వారే సిగ్గుమాలిన వారు అంటూ రివర్స్ కౌంటర్ వేసింది. రాత్రంతా నా వీడియోలను ఆసక్తిగా చూసిన వారే తెల్లారిన తర్వాత నాపై విమర్శలు చేయడం దారుణం అంటూ పూనం పాండే వ్యాఖ్యలు చేసింది.

కంగనా రనౌత్ షో లో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు షేర్ చేస్తున్నారు. పూనం ఎప్పుడైనా కూడా సోషల్ మీడియా సెన్షేషన్‌ అనడంలో సందేహం లేదు. మరోసారి ఆమె వ్యాఖ్యలతో సెన్సేషన్ గా మారింది.