Begin typing your search above and press return to search.

బూతు బోర్‌ కొట్టి ఫ్యామిలీ పాత్రలు అడుగుతోంది

By:  Tupaki Desk   |   5 Feb 2022 4:30 PM GMT
బూతు బోర్‌ కొట్టి ఫ్యామిలీ పాత్రలు అడుగుతోంది
X
పూనమ్‌ పాండే అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన అభిప్రాయం వెంటనే మొదలు అవుతుంది. ఆమె సినిమాలు మరియు సోషల్‌ మీడియా పోస్ట్‌ లు ఇంకా వ్యాఖ్యలు ఇలా ప్రతి ఒక్కటి కూడా బూతు అన్నట్లుగా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.. అది అభిప్రాయమే కాదు నిజం కూడా అనడంలో సందేహం లేదు. ఆమె ఆ బూతు వల్లే దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్‌ లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్‌ మీడియాలో హాట్ ఫొటోలు మరియు చేసిన కొన్ని సినిమాలైనా అందులో అందాల ఆరబోత.. వివాదాస్పద విషయాలు ఇలా అనేక విషయాలు ఆమెను జాతీయ స్థాయి సెలబ్రెటీని చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు ఆ ఇమేజ్ తోనే సెలబ్రెటీగా కొనసాగిన పూనమ్‌ పాండే తన ఇమేజ్ ను మార్చుకోవాలనే కోరికతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆమె వ్యవహారం ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ కు ఆశ్చర్యంగా ఉంది.

తాజాగా ఈ అమ్మడు చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యంను కలిగిస్తోంది. ఇన్నాళ్లు సోషల్‌ మీడియాలో హాట్‌ వీడియోలు మరియు ఫొటోలను చేయడానికి కారణం కేవలం పాపులారిటీని సంపాదించుకోవడం.. సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం కోసమే. జనాలు నన్ను బోల్డ్ అని పిలిస్తే అగౌరవం గా కాకుండా గౌరవంగానే భావిస్తాను. కొందరు ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి నా భర్తకు మీరు అంటే చాలా ఇష్టం అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. జనాలు ఇప్పుడు అంతా కూడా ఓపెన్‌ మైండ్ తో ఉన్నారు. ఇలాంటివి గ్లామర్ వరల్డ్‌ లో చాలా కామన్‌ అని అనుకుంటున్నారు. శృంగారానికి మరియు ఎరోటికాకు తేడా తెలియని వారు ఉన్నారు. నేను ఏం చేసినా కూడా ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం మాత్రమే చేశాను. నేను పోర్న్‌ ఇండస్ట్రీలో ఉన్నాను అని చాలా మంది అనుకుంటారు. కాని వారికి తెలియని విషయం ఏంటీ అంటే పోర్న్‌ ఇండస్ట్రీకి ఎరోటికా కు మద్య చాలా తేడా ఉందని పూనమ్‌ చెప్పుకొచ్చింది.

నేను ఎప్పుడు కూడా పోర్న్‌ కు ఆ ఇండస్ట్రీకి వ్యతిరేకం. మన దేశంలో ఆమోదయోగ్యం కాని ఆ ఇండస్ట్రీకి నేను దూరంగానే ఉన్నాను. మన దేశం ఆ ఇండస్ట్రీని ఎప్పటికి అనుమతించవద్దు అనే నేను కోరుకుంటాను. కామసూత్ర కు పోర్న్‌ కు తేడా ఉంటుంది. అందులోకి ఇది తీసుకు రావడంను నేను వ్యతిరేకిస్తాను అంది. నేను మాట్లాడేది.. నేను చేసేది అస్సలు పోర్న్‌ కాదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు నేను గ్లామర్ డాల్‌ గా పేరు దక్కించుకున్నాను. చాలా మంది నన్ను బూతు స్టార్‌ గానే గుర్తిస్తున్నారు. అందుకే ఇకపై నేను అమ్మగా అక్కగా చెల్లిగా నటించాలని భావిస్తున్నాను. సినిమాల్లో లేదా వెబ్‌ సిరీస్ ల్లో అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఈ అమ్మడు ఫిల్మ్ మేకర్స్ కు ఆఫర్‌ ఇచ్చింది. అయితే ఇన్నాళ్లు ఒక ఉద్దేశ్యంతో ఆమెను చూసిన జనాలు ఇప్పుడు మరో ఉద్దేశ్యంతో చూసేందుకు ఇష్టపడుతారా అనేది అనుమానమే. ఫిల్మ్‌ మేకర్స్ ఆమెను అమ్మగా అక్కగా చూపించడం అంటే ఖచ్చితంగా సాహస నిర్ణయమే. మరి ఆ సాహస నిర్ణయంను ఎవరైనా తీసుకునేందుకు ముందుకు వస్తారా చూడాలి.