Begin typing your search above and press return to search.
మీర్జాపూర్ 2 నటి దుమ్ము దుమారం
By: Tupaki Desk | 18 Jun 2021 5:30 AM GMTవెబ్ సిరీస్ ల వెల్లువతో చాలామంది నటీమణులకు ఇప్పుడు అవకాశాలకు కొదవేమీ లేదు. అంతంత మాత్రం ట్యాలెంట్ ఉన్నా అవకాశాలు వెంటపడుతున్నాయి. ఆ కోవలోనే ఇప్పటికే చాలామంది హిమచల్ బ్యూటీస్ టీవీ సినీరంగాల్లో అవకాశాలు అందుకున్నారు. కంగన .. పాయల్ రాజ్ పుత్ .. రుహానీ శర్మ లాంటి భామలు హిమచల్ ప్రదేశ్ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీ సహా బాలీవుడ్ లోనూ హల్చల్ చేస్తున్నారు.
ఇప్పుడు అదే బాటలో పాపులరవుతోంది పూనమ్ రాజ్ పుత్. ఈ భామ పేరు మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా మార్మోగింది. ఈ పంజాబీ బ్యూటీ సోషల్ మీడియాలో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది.
నిజానికి పూనమ్ రాజ్‌పుత్ పంజాబీ వినోద పరిశ్రమలో పాపులరై అక్కడ అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు ప్రకటనలలో నటించారు. అనంతరం పాపులర్ టీవీ సిరీస్ లు సిఐడి -కోడ్ రెడ్ -నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా వంటి వాటితో పేరు తెచ్చుకుంది. రెండేళ్ల తరువాత పూనమ్ రాజ్ పుత్ విద్యాబాలన్ నటించిన బేగం జాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పూనమ్ రాజ్‌పుత్ తదుపరి డాన్స్ బార్ అనే చిత్రంలో నటించింది. మీర్జాపూర్ రెండవ సీజన్ లో కీలక పాత్రతో మెప్పించింది.
పూనమ్ రాజ్‌పుత్ హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్‌లో జన్మించారు. చండీగ ర్ లో ఎంబీఏ చేస్తున్నప్పుడు ఆమె నటనా వృత్తిలో దూసుకుపోయింది. ఆసక్తికరంగా ఈ పంజాబీ భామ నివశించే చోటికి మనాలి ఎంతో చేరువలో ఉంటుంది. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ స్వస్థలం మనాలి అన్న సంగతి తెలిసినదే.