Begin typing your search above and press return to search.
పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించిన పూనమ్..!
By: Tupaki Desk | 15 Oct 2022 10:34 AM GMTసోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట అనేక చర్చలకు దారి తీసింది. అందరికీ కర్వాచౌత్ శుభాకాంక్షలు చెబుతూ గురువారం రాత్రి పూనమ్ ఓ ఫోటో పంచుకుంది.
ఇందులో పూనమ్ కౌర్ జల్లెడ చేతబట్టి.. నవ్వుతూ కనిపించింది. అయితే ఈ ఫోటో చూడగానే నెటిజన్లకు పలు సందేహాలు వచ్చాయి. పూనమ్ కు పెళ్లైందా? లేదా పెళ్లి కుదిరిందా? చంద్రబింబాన్ని చూసిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని చూశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కర్వాచౌత్ అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ. భర్తకు విజయాలు చేకూరాలని.. దీర్ఘాయుష్షును ఉండాలని పెళ్లైన మహిళలు పార్వతీదేవికి ఈ పండుగ రోజున పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి.. భక్తి శ్రద్దలతో అమ్మవారిని వేడుకుంటారు. రాత్రి సమయంలో జల్లెడ నుంచి చంద్రుడిను చూసి.. ఆపై భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు.
అయితే పూనమ్ కౌర్ కూడా ఈ పండుగను జరుపుకున్నట్లు ఫోటో షేర్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇది పెళ్ళైన మహిళలు చేసుకునే ఫెస్టివల్ కదా? మీకు కూడా పెళ్లి అయ్యిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. దీనికి తాజాగా పూనమ్ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది.
''ఈరోజు చుట్టూ తిరుగుతున్న కథనాలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయా లేక మిషనరీల ఆలోచనా విధానంతో ప్రేరేపించబడ్డాయో నాకు తెలియదు. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి - ఓం నమః శివాయ.. వాసుదేవ కుటుంబం మీరు నేర్చుకోవలసినది'' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా కర్వాచౌత్ పండుగను ఎవరెవరు జరుపుకుంటారో తెలియజెప్పాడనికి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని స్క్రీన్ షాట్స్ ని పూనమ్ కౌర్ షేర్ చేసింది. వీటి ద్వారా పెళ్లైన మహిళలే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ కాబోయే భర్తల కోసం ఈ వేడుకలను జరుపుకుంటారని తెలియజెప్పింది.
పెళ్లి కుదిరినవారు, ప్రేమలో ఉన్నవారు సైతం తమకు కాబోయే భాగస్వామి కోసం కలిసి కర్వాచౌత్ సందర్భంగా పూజలు చేస్తారు. కాకపోతే పెళ్ళైన మహిళలు చంద్రుడిని చూస్తే.. పెళ్లికాని అమ్మాయిలు మాత్రం చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారని పూనమ్ కౌర్ వివరించింది.
ఏదైతేనేం సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న పూనమ్.. ఇప్పుడు కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన కారణంగా చర్చనీయాంశంగా మారింది. ఎలా అయితేనేం ఆమెకు వార్తల్లో నిలిచింది కదా అని నెటిజన్లు వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.