Begin typing your search above and press return to search.
'నన్ను కార్నర్ చేయలేరు'.. PK Love పై పూనమ్ స్పందన..!
By: Tupaki Desk | 3 Jun 2022 6:30 AM GMTపూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచే హీరోయిన్లలో ఈ ఉత్తరాది భామ ఒకరు. 'మాయాజాలం' సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే పూనమ్ కౌర్.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తరచుగా ఎవరో ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్స్ పెట్టడం.. పేరు మెన్షన్ చేయకుండా ట్వీట్లు చేయడం.. అందులో ఏదో నిగూడ అర్థం ఉందని అందరూ తన గురించి చర్చించుకునేలా చేయడం.. ఇలానే పూనమ్ ఎక్కువగా ఫేమస్ అయింది.
ఇండస్ట్రీలో గురూజీ అని పిలబడే వ్యక్తి కారణంగా తన సినీ జీవితం నాశనమైందని ఆరోపించిన పూనమ్.. #PKLove అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతూ నెట్టింట చర్చకు తెర లేపుతుంది. పవన్ కళ్యాణ్ విషయమై పోస్టులు పెడుతుందేమో అని అందరూ సందేహించేలా చేస్తుంది.
అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో pk love గురించి పూనమ్ ను నేరుగా అడిగినా.. సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చింది. తాజాగా అమ్మడికి మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. కాకపోతే ఈసారి స్కిప్ చేయకుండా నెటిజన్ ట్వీట్ కు సమాధానమిచ్చింది.
PkLove అంటే.. పూనమ్ కౌరా? లేక పవన్ కళ్యాణా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి పూనమ్ స్పందిస్తూ.. ''కారణం లేకపోయినా మీరు నన్ను టీజ్ చేయాలని చేస్తుంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటాను అని.. అర్థమైందా తమ్ముడూ? నన్ను కార్నరింగ్ చేయలేరు'' అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. దీంతో నెటిజన్ వెంటనే ట్వీట్ డిలీట్ చేసాడు.
కొద్ది రోజుల క్రితం పూనమ్ కౌర్ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఓ ఫోటో షేర్ చేయడం అనేక చర్చలకు దారి తీసింది. దీనిపై అనేక ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అమ్మడు ట్వీట్ చేస్తూ.. ఇప్పటివరకూ నాకు జరిగిన డ్యామేజ్ చాలు. ఈ ఫోటోలో ఉన్నది నా స్నేహితుల పిల్లలు. నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే 16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ అవుదామని ఇండీస్ట్రీలో అడుగుపెట్టిన పూనమ్ కౌర్.. ఆశించిన మేర అవకాశాలు అందుకోలేకపోయింది. 'ఒక విచిత్రం' 'సౌర్యం' 'వినాయకుడు' 'ఈనాడు' 'నాగవల్లి' 'గగనం' 'ఆడుమగాడ్రాబుజ్జి' 'పొగ' 'సూపర్ స్టార్ కిడ్నాప్' 'ఎటాక్' 'నెక్స్ట్ ఏంటి' వంటి పలు చిత్రాల్లో నటించింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల 'నాతి చరామి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.