Begin typing your search above and press return to search.
సైలెంట్ అయిపోయిన కామ్రేడ్
By: Tupaki Desk | 1 Aug 2019 5:30 PM GMTఈ రోజుతో డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఈ మాత్రం దానికే ఏదో యాభై రోజులైన ఫీలింగ్ ఉంది ప్రేక్షకులకి. అభిమానులు కూడా దీని ఫలితం పట్ల సంతృప్తిగా లేరు. నిర్మాతలు మొదటి మూడు రోజుల్లోనే 23 కోట్లు తెచ్చేసింది ఎనభై శాతం రికవరీ అయ్యిందని చెప్పుకున్నారు కానీ ఆ తర్వాత మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. కారణం వీక్ డేస్ వసూళ్లు మరీ తీసికట్టుగా పడిపోవడమే. మల్టీ ప్లెక్సుల వరకు కొంతమేర పర్వాలేదు అనిపిస్తున్నా సింగల్ స్క్రీన్స్ తో పాటు బిసి సెంటర్స్ లో పరిస్థితి రేపో ఎల్లుండో అనేలా ఉంది. జరిగిన థియేట్రికల్ బిజినెస్ 28 కోట్లని చెబుతున్నారు కానీ ఇప్పుడు దాన్ని రీచ్ కావడమే అసలు సవాల్ గా నిలుస్తోంది.
పావు గంట ట్రిమ్మింగ్ చేసి కాలేజీ క్యాంటీన్ సాంగ్ జోడించినా దాని ప్రభావం ఏ మాత్రం లేదు. వీటి కోసమే మళ్ళీ సినిమా చూసేంత సీన్ లేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా 15 నుంచి 20 కోట్ల మధ్య బిజినెస్ చేసుంటే టాక్సీ వాలా తరహాలో సేఫ్ ప్రాజెక్ట్ అయ్యేది. మొత్తం ప్రీ రిలీజ్ పబ్లిసిటీ కోసం యూనిట్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఎడిట్ చేశాక చాలా బాగుందని హీరో హీరోయిన్లతో సహా టీం మొత్తం పదే పదే చెబుతున్నా పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు.
డియర్ కామ్రేడ్ ఫలితం ఒకరకంగా చెప్పాలంటే లెసన్ లాగా తీసుకోవచ్చు. మనకు గొప్పగా అనిపించిన ఫిలాసఫీని మోతాదుకు మించి తెరపై చూపిస్తే ప్రేక్షకులు మెచ్చరనే సందేశం కామ్రేడ్ ద్వారా రుజువయ్యింది. లైన్ బాగున్నప్పటికీ ప్రెజెంటేషన్ లో జరిగిన తడబాటు వల్ల భరత్ కమ్మ ఇప్పుడీ ఫెయిల్యూర్లో ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. ఓవరాల్ గా డియర్ కామ్రేడ్ ఫైనల్ గా ఏ ఫిగర్ దగ్గర ఆగుతాడో ఈ వీకెండ్ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది