Begin typing your search above and press return to search.

దెయ్యం భయంతో దెయ్యాన్నయ్యా

By:  Tupaki Desk   |   7 April 2015 9:30 AM GMT
దెయ్యం భయంతో దెయ్యాన్నయ్యా
X
సీమటపాకాయ్‌ పూర్ణ సైలెంటుగా టాలీవుడ్‌లో బిజీ అయిపోతోంది. ఈ భామ కెరీర్‌ ప్రారంభించి ఐదేళ్లు పైగానే అవుతోందిక్కడ. అయితే అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్‌ మాత్రం సంపాదించలేకపోయింది. అల్లరి రవిబాబుతో వరుసగా రెండు సినిమాల్లో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది.

అవును, అవును 2 రెండు సినిమాలు నాకు బాగా పేరు తెచ్చాయి. తొలిభాగంలో ఎలా నటించానో, రెండో భాగంలోనూ అలాగే నటించానని పేరొచ్చింది. అలాగే ఈ చిత్రం తొలి భాగానికి కంటిన్యూషన్‌ మాత్రమే. కథలో మార్పు లేదు. అందుకే నా పని సులువైంది. దెయ్యం అంటే నిజజీవితంలో నాకు ఎంతో భయం. అందుకే నన్ను ఈ సినిమాకి రవిబాబు ఎంచుకున్నారు. భయస్తురాలిగానే నటించు చాలు అన్నారు. అదే చేశాను. నటిగా పేరొచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పింది.

అంతేకాదు ఇప్పటికే వరుసగా రెండు హారర్‌ సినిమాల్లో నటించాను కాబట్టి ఇక నుంచి అన్నీ అలాంటి అవకాశాలే వస్తున్నాయి. కొందరు దర్శకులు కలిసి హారర్‌ జోనర్‌ కథల్ని వినిపించారు. అయితే వాటన్నిటికీ నో చెప్పాను. కేవలం దెయ్యం సినిమాల నాయికగానే మిగిలిపోవాలని లేదు. అందుకే వద్దనుకున్నా. అయితే ఓ దర్శకుడు మాత్రం నన్ను ఏకంగా దెయ్యాన్ని చేసేస్తున్నాడు. ఓ చిత్రంలో దెయ్యం పాత్రలో నటిస్తున్నా.. అని గుక్కతిప్పుకోకుండా చెప్పేసింది అమ్మడు.

అనుష్క నటించిన జేజమ్మలాగా నటించాలన్నది నా కల. అది నెరవేరుతుందనే ఆశిస్తున్నా. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రం కాన్సెర్ట్‌ కోసం అమెరికా వెళుతున్నా. నెలరోజులు అక్కడే గడిపి తిరిగి వస్తాను. అంతవరకూ బ్రేక్‌ అంటూ ముచ్చట్లాడింది.